పన్ను వసూళ్లు.. రూ.10.54 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-11-12T02:42:53+05:30 IST

ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్నా పన్ను వసూళ్లు మాత్రం జోరందుకున్నాయి.

పన్ను వసూళ్లు.. రూ.10.54 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్నా పన్ను వసూళ్లు మాత్రం జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 10 వరకు స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 30.69 శాతం ఎక్కువని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను రిఫండ్స్‌ పోను.. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.8.71 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మొత్తానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలు చేయాలని కేంద్ర బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్ణయించిన దాంట్లో ఇది 61.31 శాతానికి సమానం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 10 వరకు రూ.1.83 లక్షల కోట్లు రిఫండ్స్‌ కింద పన్ను చెల్లింపుదారులకు చెల్లించారు.

Updated Date - 2022-11-12T02:42:53+05:30 IST

Read more