మార్కెట్లో టయోటా సరికొత్త గ్లాంజా

ABN , First Publish Date - 2022-03-16T08:23:23+05:30 IST

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కంపెనీ పూర్తిగా సరికొత్తగా తీర్చిదిద్దిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ..

మార్కెట్లో టయోటా  సరికొత్త గ్లాంజా

 ప్రారంభ ధర రూ.6.39 లక్షలు 

న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కంపెనీ పూర్తిగా సరికొత్తగా తీర్చిదిద్దిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.  1100 సీసీ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు ప్రారంభ ధర రూ.6.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఆటోమేటిక్‌ వెర్షన్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఆటోమేటెడ్‌ వెర్షన్‌ ప్రారంభ ధర రూ.7.79 లక్షలు. ఇది లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా దీని ప్రత్యేకతలు. కనెక్టెడ్‌ టెక్నాలజీ కూడా కలిగి ఉంది.

Read more