టాటా మోటార్స్‌ ‘అనుభవ్‌‘ మొబైల్‌ షోరూమ్‌లు

ABN , First Publish Date - 2022-03-04T08:14:02+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లకు ఇంటి ముంగిటనే కార్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించడానికి దేశవ్యాప్తంగా...

టాటా మోటార్స్‌ ‘అనుభవ్‌‘ మొబైల్‌ షోరూమ్‌లు

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లకు ఇంటి ముంగిటనే కార్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించడానికి దేశవ్యాప్తంగా 103 మొబైల్‌ షోరూమ్‌లు ప్రారంభించనున్నట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. గ్రామీణ మార్కెటింగ్‌ వ్యూ హంలో భాగంగా ‘అనుభవ్‌’ పేరిట ప్రారంభించిన ఈ షోరూమ్‌ ఆన్‌ వీల్స్‌ ప్రజలకు ఇంటి వద్దనే కారు కొనుగోలు చేసే అరుదైన అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. వీటిలో కంపెనీ ఎస్‌యూవీలు సహా విభిన్న శ్రేణి కార్లు, యాక్సెసరీలు, ఫైనాన్స్‌ స్కీమ్‌లు, టెస్ట్‌ డ్రైవ్‌, కార్ల ఎక్స్ఛేంజీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్‌ షోరూమ్‌లను సమీపంలోని డీలర్‌షి్‌పలు టాటా మోటార్స్‌ పర్యవేక్షణ, మార్గదర్శకంలో నిర్వహిస్తాయని పేర్కొంది. 

Read more