తాజ్‌ జీవీకే లాభం రూ.15.97 కోట్లు

ABN , First Publish Date - 2022-08-04T07:49:40+05:30 IST

తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసా ర్ట్స్‌ లిమిటెడ్‌ వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.86.47 కోట్ల ఆదాయంపై...

తాజ్‌ జీవీకే  లాభం రూ.15.97 కోట్లు

హైదరాబాద్‌: తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసా ర్ట్స్‌ లిమిటెడ్‌ వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.86.47 కోట్ల ఆదాయంపై రూ.15.97 కోట్ల నికరలాభం ప్రకటించింది. ఒక ఏడాది క్యు1లో కంపెనీ ప్రకటించిన గరిష్ఠ లాభం ఇదే. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 246 శాతం పెరిగింది. గత ఏడాది ప్రకటించిన రూ.3.48 కోట్ల నష్టంతో పోల్చితే పన్ను చెల్లింపులకు ముందు లాభం (ఎబిటా) రూ.30.51 కోట్లుగా నమోదయింది. 

Updated Date - 2022-08-04T07:49:40+05:30 IST