రాష్ట్రాల సబ్సిడీలు ఆందోళనకరం

ABN , First Publish Date - 2022-12-30T03:14:02+05:30 IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సబ్సిడీలు భారీగా పెరుగుతుండటంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. యోగ్యత లేని సబ్సిడీలు...

రాష్ట్రాల సబ్సిడీలు ఆందోళనకరం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సబ్సిడీలు భారీగా పెరుగుతుండటంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. యోగ్యత లేని సబ్సిడీలు అభివృద్ధి, మూలధన వ్యయాలకు నిరోధకంగా మారాయని ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. రాష్ట్రాల సబ్సిడీ వ్యయాలు 2020-21లో 12.9 శాతం, 2021-22లో 11.2 శాతం పెరిగాయి. అంతేకాదు, రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయాల్లో సబ్సిడీల వాటా 2019 -20లో 7.8 శాతంగా ఉండగా.. 2021-22లో 8.2 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ రిపోర్టులో ప్రస్తావించింది. రాష్ట్రాల రెవెన్యూ వ్యయాల్లో సబ్సిడీల వాటా పెరగడంపై 15వ ఆర్థిక సంఘం నివేదిక కూడా గతంలో హెచ్చరించింది.

Updated Date - 2022-12-30T03:14:02+05:30 IST

Read more