చిన్న పట్టణాల్లో ఔత్సాహికులకు కొదవ లేదు

ABN , First Publish Date - 2022-12-15T01:27:50+05:30 IST

ఒకరి మేధా శక్తిని అంచనా వేయడానికి ఇంగ్లి్‌షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ ధోరణి మారుతోంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో...

చిన్న పట్టణాల్లో ఔత్సాహికులకు కొదవ లేదు

కెవిన్‌కేర్‌ చైర్‌పర్సన్‌ సీకే రంగనాథన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఒకరి మేధా శక్తిని అంచనా వేయడానికి ఇంగ్లి్‌షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ ధోరణి మారుతోంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో వినూత్న ఆలోచనలు కలిగిన ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారని కెవిన్‌కేర్‌ చైర్‌పర్సన్‌ సీకే రంగనాథన్‌ తెలిపారు. అవగాహన లేకపోవడం, ఆత్మనూన్యత భావం వల్లే వారు రాణించలేకపోతున్నారు. హైదరాబాద్‌లో చాలా స్టార్ట్‌పలు రావడానికి ప్రోత్సాహమే కారణమని టై గ్లోబల్‌ సదస్సులో సాధారణ నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై ఆయన మాట్లాడారు. టీ హబ్‌ సీఈఓ ఎం శ్రీనివా్‌సరావు మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యా, హెల్త్‌కేర్‌ రంగంలో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించడానికి టీ-హబ్‌ స్టార్ట్‌పలు తెలంగాణలో కృషి చేస్తున్నాయని చెప్పారు. నటుడు, ఇన్వెస్టర్‌, ఆంత్రప్రెన్యూర్‌ సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. స్టార్ట్‌పలు మంచి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి. ఆ ఉత్పత్తిపై వారికి నమ్మకం ఉండాలి. ఉత్పత్తి మంచిదైతే స్టార్ట్‌పకు విలువ దానంతట అదే వస్తుందని అన్నారు. అయితే.. చాలా మంది స్టార్టప్‌ వ్యవస్థాకులు ముందుగానే స్టార్టప్‌ విలువపై ఆలోచిస్తున్నారని తెలిపారు. కాగా టీజీఎస్‌ 100 పేరుతో 100 స్టార్ట్‌పలను టై గ్లోబల్‌ సదస్సు గుర్తించింది. వీటికి అన్ని విధాలా టై సహకరించనున్నట్లు టై గ్లోబల్‌ సదస్సు సహ చైర్‌ మురళీ బుక్కపట్నం తెలిపారు.

Updated Date - 2022-12-15T01:27:59+05:30 IST