సైయెంట్ లాభం రూ.116 కోట్లు
ABN , First Publish Date - 2022-07-22T08:27:10+05:30 IST
జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.116 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.116 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.115 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.1,084 కోట్ల నుంచి రూ.1,284 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసికంలో 42.43 కోట్ల డాలర్ల విలువైన 6 పెద్ద ఒప్పందాలను కంపెనీ కుదుర్చుకుంది. ఒక త్రైమాసికంలో ఇప్పటి వరకూ కంపెనీ కుదుర్చుకున్న అత్యధిక విలువైన ఒప్పందాలు ఇవేనని సైయెంట్ తెలిపింది.