కొత్త గరిష్టానికి SBI లైఫ్.. 2 నెలల్లో 24% ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-18T19:44:03+05:30 IST
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్(SBI Life Insurance) కంపెనీ షేర్లు గురువారం నాటి ఇంట్రా-డే(Intra-Day)లో బీఎస్ఈ(BSE)లో 2 శాతం పెరిగి

SBI Life : ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్(SBI Life Insurance) కంపెనీ షేర్లు గురువారం నాటి ఇంట్రా-డే(Intra-Day)లో బీఎస్ఈ(BSE)లో 2 శాతం పెరిగి రూ. 1,332.30 వద్ద కొత్త గరిష్టానికి చేరాయి. బీమా కంపెనీ స్టాక్(Insurance Company Stock) గత రెండు నెలల్లో 24 శాతం ర్యాలీ చేయగా.. గత ఆరు నెలల్లో 16 శాతం పెరిగింది. ఇది ఆరు నెలల కాలంలో ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex)లో 4 శాతం పెరిగింది. SBI లైఫ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ.
SBI లైఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ త్రైమాసికం) వృద్ధి, మార్జిన్లు రెండూ సానుకూలంగా ఉన్నాయని సంస్థ నివేదించింది. ఈ జూన్ క్వార్టర్ నాటికి 5శాతం పెరుగుదలతో రూ. 390 కోట్ల లాభాలను SBI లైఫ్ ప్రకటించింది. కానీ ఈ లాక్డౌన్ కాలంలో కొత్త వ్యాపారం మాత్రం పుంజుకోలేదని, ఆదాయ పెట్టుబడులు మాత్రం రెట్టింపయ్యాయని పేర్కొంది. ప్రీమియం కలెక్షన్లు మాత్రం ఈ జూన్ త్రైమాసికంలో పుంజుకున్నాయని SBI లైఫ్ ఇన్స్యూరెన్స్ వెల్లడించింది.