ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు పెంపు

ABN , First Publish Date - 2022-08-14T09:02:51+05:30 IST

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. రూ.2 కోట్లలోపు రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎ్‌ఫడీ)పై వడ్డీ రేట్లను పెంచింది.

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు పెంపు

 శనివారం నుంచే అమల్లోకి.. 

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. రూ.2 కోట్లలోపు రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎ్‌ఫడీ)పై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఎంపిక చేసిన కాలపరిమితి డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. కనీసం 7 రోజుల నుంచి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు కాలపరిమితితో ఎఫ్‌డీ సదుపాయాన్ని కల్పిస్తోన్న ఎస్‌బీఐ.. సాధారణ ప్రజానీకానికి వాటిపై ఆఫర్‌ చేస్తోన్న కొత్త వడ్డీ రేట్ల శ్రేణి 2.90 శాతం నుంచి 5.65 శాతం స్థాయిలో ఉంది. కాగా, సీనియర్‌ సిటిజన్ల(60 ఏళ్లు పైబడిన వారికి)కు ఆఫర్‌ చేస్తున్న వడ్డీ రేట్ల శ్రేణి 3.40-6.45 శాతం స్థాయిలో ఉంది. 

Updated Date - 2022-08-14T09:02:51+05:30 IST