samsung credit card: క్రెడిట్ కార్డులు ప్రారంభించిన సామ్‌సంగ్.. కొత్త కార్డు కావాలనుకుంటున్నవారికి..

ABN , First Publish Date - 2022-09-27T01:41:33+05:30 IST

దక్షిణకొరియా మల్టీనేషనల్ కంపెనీ సామ్‌సంగ్ (samsung) భారత్‌లో కొత్తగా క్రెడిట్ కార్డు(credit card)ను ఆవిష్కరించింది. యాక్సిస్ బ్యాంక్ (Axis bank), విసా(Visa)ల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులను విడుదల చేసింది.

samsung credit card: క్రెడిట్ కార్డులు ప్రారంభించిన సామ్‌సంగ్.. కొత్త కార్డు కావాలనుకుంటున్నవారికి..

క్షిణకొరియా మల్టీనేషనల్ కంపెనీ సామ్‌సంగ్ (samsung) భారత్‌లో కొత్తగా క్రెడిట్ కార్డు(credit card)ను ఆవిష్కరించింది. యాక్సిస్ బ్యాంక్ (Axis bank), విసా(Visa)ల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులు ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా సామ్‌సంగ్ ఉత్పత్తులు, సర్వీసులపై ఏడాదిపాటు 10 శాతం క్యాష్‌బ్యాక్‌తోపాటు ఇతర ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా ఈఎంఐ (EMI), నాన్ - ఈఎంఐ (non EMI) లావాదేవీలపై ప్రస్తుతమున్న ఆఫర్లు కంటే అధిక క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభించనున్నాయి. సామ్‌సంగ్ ఉత్పత్తులు, సర్వీసులు కొనుగోలు చేసిన ప్రతిసారి కస్టమర్‌కి రివార్డులు అందేలా సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (The Samsung Axis Bank Credit Card )ను సిద్ధం చేశారు. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు లేదా సర్వీస్ సెంటర్ పేమెంట్స్, సామ్‌సంగ్ కేర్ + మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్, వారెంటీ పొడగింపులపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. పైన్ ల్యాబ్స్ (Pine Labs), బెనౌ పేమెంట్ (Benow payment) వంటి ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై సామ్‌సంగ్ వస్తువులు కొనుగోలు చేసినా క్యాష్ బ్యాక్ ఆఫర్లు వర్తిస్తాయి. ఇక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సామ్‌సంగ్.కామ్ (Samsung.com), సామ్‌సంగ్ యాప్ (Samsung Shop App), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తోపాటు అధికారిక సామ్‌‌సంగ్ సర్వీసు సెంటర్ల వద్ద కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. దీంతో సామ్‌సంగ్ కంపెనీ ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టినట్టయ్యింది.


సామ్‌సంగ్ ఇండియా (Samsung india), యాక్సిస్ బ్యాంక్ (Axis bank)లు కీలకమైన వ్యాపార సంస్థలైన  బిగ్‌బాస్కెట్, మింత్రా, టాటా 1 ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సామ్‌సంగ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల ప్రతి వ్యయంపైనా రివార్డులు అందించేలా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. అంతేకాకుండా ఈ కార్డుకి అనుబంధంగా ఎయిర్‌పోర్ట లాంజ్ యాక్సెస్, ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ వివర్, డైనింగ్ ఆఫర్స్‌ కూడా వినియోగదారులు పొందొచ్చు. 


2 వేరియెంట్ల కార్డులు

ఈ క్రెడిట్ కార్డులో 2 వేరియెంట్లు ఉంటాయి. ఒకటి ‘విసా సిగ్నేచర్’ కాగా రెండవది ‘వీసా ఇన్‌ఫినిటీ’. సిగ్నేచర్ వేరియెంట్ కార్డుదారులు ఏడాదికి రూ.10 వేల వరకు క్యాష్ బ్యాంక్ పొందొచ్చు. నెలవారి క్యాష్ బ్యాక్ పరిమితి రూ.2500గా ఉంటుంది. ఇక వీసా ఇన్‌ఫినిటీ కార్డుదారులు ఏడాదికి రూ.20 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. నెలవారి క్యాష్ బ్యాక్ పరిమితి రూ.5 వేలుగా ఉంది. మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. కనీస లావాదేవీ వ్యాల్యూపై పరిమితి అంటూ ఏమీ లేదు. అంటే చిన్న వస్తువు కొనుగోలు చేసినా కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. సామ్‌సంగ్ ఎకోసిస్టమ్‌ వెలుపల వ్యయాలు చేసినా కస్టమర్లు ‘ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు’  పొందొచ్చు. 


సిగ్నేచర్ వేరియెంట్ వార్షిక ఫీజు రూ.500గా (ట్యాక్సులు అదనం) ఉంది. ఇన్‌ఫినిటీ వేరియెంట్ వార్షిక ఫీజు రూ.5000 (ట్యాక్సులు అదనం)గా ఉంది. కాగా రెండు కార్డులపైనా వెల్‌కమ్ ప్రయోజనాలుగా ఎడ్జ్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. మొదటి మూడు లావాదేవీలు చేసి ఈ పాయింట్లు పొందొచ్చు. సిగ్నేచర్ కార్డుదారులు రూ.500 విలువ చేసే 2500 పాయింట్లు, ఇన్‌ఫినిటీ వేరియెంట్ కార్డుహోల్డర్లు రూ.6 వేలు విలువ చేసే 30 వేల పాయింట్లు పొందొచ్చు. ఇవి వన్‌-టైమ్ వెల్‌కమ్ బెనిఫిట్‌గా ఉంటాయి.


ఎలా అప్లై చేయాలంటే..

సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం కస్టమర్లు www.samsung.com/in వెబ్‌సైటుతోపాటు సామ్‌సంగ్ షాప్, సామ్‌సంగ్ పే, సామ్‌సంగ్ మెంబర్స్ యాప్స్‌తోపాటు యాక్సిస్ బ్యాంక్ మార్గాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన samsung.com/in/samsung-card. పై కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. త్వరలోనే అప్లికేషన్ ఓపెన్ అవుతుందని, అయితే తేదీని ఇంకా నిర్ణయించలేదని సామ్‌సంగ్ స్పష్టం చేసింది.

Updated Date - 2022-09-27T01:41:33+05:30 IST