‘ఎఫ్‌ఎంసీజీ’లోకి రిలయన్స్‌

ABN , First Publish Date - 2022-12-16T00:49:53+05:30 IST

భారత ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హెచ్‌యూఎల్‌, ఐటీసీతో నేరుగా తలపడేందుకు ముకేశ్‌ అంబానీకి...

‘ఎఫ్‌ఎంసీజీ’లోకి రిలయన్స్‌

ఇండిపెండెన్స్‌ బ్రాండ్‌నేమ్‌తో పలు ఉత్పత్తుల విడుదల

తొలుత గుజరాత్‌లోకి ఎంట్రీ.. త్వరలో దేశవ్యాప్తంగా..

న్యూఢిల్లీ: భారత ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హెచ్‌యూఎల్‌, ఐటీసీతో నేరుగా తలపడేందుకు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది. దేశంలో అతిపెద్ద చిల్లర వర్తక సంస్థగా ఎదిగిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌).. ‘ఇండిపెండెన్స్‌’ పేరుతో కన్జ్యూమర్‌ ప్యాకేజ్డ్‌ గూడ్స్‌ బ్రాండ్‌ను గురువారం లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్‌ ఉత్పత్తులను తొలుత గుజరాత్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న రిలయన్స్‌.. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఆర్‌ఆర్‌వీఎల్‌ తన అనుబంధ విభాగమైన రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడ క్ట్స్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ బ్రాండ్‌ ఉత్పత్తులను విడుదల చేసింది. వంటనూనెలు, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఉత్పత్తులు, ఇతర నిత్యావసర కిరాణా సరుకులను ఈ బ్రాండ్‌నేమ్‌తో విక్రయించనుంది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయంలోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది ఆగస్టు 29న జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ ప్రకటించారు.

Updated Date - 2022-12-16T00:50:02+05:30 IST