మొత్తం 79,669 నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు - Reserve Bank of India

ABN , First Publish Date - 2022-05-31T01:59:45+05:30 IST

మొత్తం 79,669 నకిలీ రూ. 500 నోట్లను 2022 ఆర్ధిక సంవత్సరంలో గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నివేదిక పేర్కొంది.

మొత్తం 79,669 నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు  - Reserve Bank of India

ముంబై : మొత్తం 79,669 నకిలీ రూ. 500 నోట్లను 2022 ఆర్ధిక సంవత్సరంలో గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  నివేదిక పేర్కొంది. RBI వార్షిక నివేదిక ప్రకారం... బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా గుర్తించిన రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండింతలు పెరిగి, 79,669 నోట్లకు చేరుకుంది. సిస్టమ్‌లో గుర్తించిన రూ.  2,000 డినామినేషన్ నకిలీ నోట్ల సంఖ్య 2021-22లో 13,604.  ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 54.6 శాతం పెరిగింది.


ఇక... 2020-21 లో బ్యాంకింగ్ రంగంలో కనుగొనబడిన అన్ని డినామినేషన్‌ల మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు(FICNలు) గత ఆర్థిక సంవత్సరంలో 2,08,625 నుండి 2,30,971 లకు చేరాయి. ఇక... 2019-29 లో, గుర్తించిన FICN లు 2,96,695. ‘‘గతేడాదితో పోల్చితే రూ. 10, రూ. 20, రూ. 200 విలువ కలిగిన నకిలీ నోట్లలో 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం పెరుగుదల నమోదైంది. రూ. 50, రూ.100 డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు వరుసగా 28.7 శాతం, 16.7 శాతం తగ్గాయి.


మరోవైపు... 2021-22 మధ్యకాలంలో, బ్యాంకింగ్ రంగంలో గుర్తించబడిన మొత్తం FICNలలో, 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ వద్ద, మరో 93.1 శాతం ఇతర బ్యాంకుల వద్ద కనుగొన్నట్లు నివేదిక పేర్కొంది. ఇక... 2016లో అమల్లో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దుకు సంబంధించిన ప్రధాన లక్ష్యాలల్లో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడమన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు సెక్యూరిటీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం(జూలై 1, 2020 నుండి మార్చి 31, 2021 వరకు) రూ. 4,012.1 కోట్లు. అలాగే... 2021-22 లో... మురికిగా ఉన్న నోట్ల పారవేయడం 88.4 శాతం పెరిగి, 1,878.01 కోట్ల పీసెస్(నోట్ల)కు చేరుకుంది, అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య... 997.02 కోట్లు. 

Updated Date - 2022-05-31T01:59:45+05:30 IST