వీఎ్‌సఆర్‌ నాయుడుకు పీఆర్‌ఎ్‌సఐ అవార్డు

ABN , First Publish Date - 2022-12-30T03:22:12+05:30 IST

పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగంలో ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న వీఎ్‌సఆర్‌ నాయుడుకు ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) అవార్డు లభించింది...

వీఎ్‌సఆర్‌ నాయుడుకు పీఆర్‌ఎ్‌సఐ అవార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగంలో ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న వీఎ్‌సఆర్‌ నాయుడుకు ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) అవార్డు లభించింది. పీఆర్‌ఎ్‌సఐలో నాయుడు సీనియర్‌ సభ్యులు. పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ.. భోపాల్‌లో జరిగిన ఆల్‌ ఇండియా పబ్లిక్‌ రిలేషన్స్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐపీఆర్‌సీ)లో ఈ అవార్డును అందజేశారు. వీఎ్‌సఆర్‌ నాయుడు ఏపీఎ్‌సఈబీ/ఏపీ ట్రాన్స్‌కోలో 33 ఏళ్లపాటు పని చేశారు. చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌) హోదాలో పదవీ విరమణ చేశారు. పీఆర్‌ఎ్‌సఐ-అమరావతి చాప్టర్‌ వ్యవస్థాపక చైర్మన్‌గా 2018-2022 మధ్య కాలంలో సేవలు అందించారు. ప్రస్తుతం అమరావతి చాప్టర్‌కు సలహాదారుగా ఉన్నారు. గతంలో (1994-95) పీఆర్‌ఎ్‌సఐ-ఏపీ చైర్మన్‌గా పనిచేశారు. ‘అవుట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌’ అవార్డును మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగు భాయ్‌ పటేల్‌ నుంచి అందుకున్నారు.

Updated Date - 2022-12-30T03:22:12+05:30 IST

Read more