యాన్యుటీ పెన్షన్‌ పథకాలకు పోర్టబులిటీ!

ABN , First Publish Date - 2022-09-10T06:24:48+05:30 IST

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎ్‌స) చందాదారుల కోసం యాన్యుటీ పాలసీల పోర్టబులిటీపై బీమా నియంత్రణ మండలి

యాన్యుటీ పెన్షన్‌ పథకాలకు పోర్టబులిటీ!

కోల్‌కతా: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎ్‌స) చందాదారుల కోసం యాన్యుటీ పాలసీల పోర్టబులిటీపై బీమా నియంత్రణ మండలి ‘ఐఆర్‌డీఏఐ’తో పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) ప్రాథమిక చర్చలు జరిపింది. ప్రస్తుతం ఏదైనా బీమా కంపెనీ యాన్యుటీ పెన్షన్‌ పాలసీని ఎంచుకుంటే, మొదటి 15-20 రోజుల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ముగిశాక పాలసీని మార్చుకునే అవకాశం ఉండదు. యాన్యుటీ పెన్షన్‌ పథకాలు ఆఫర్‌ చేసేందుకు ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ సహా 14 బీమా కంపెనీలు పీఎ్‌ఫఆర్‌డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. 


డిజిటల్‌ రూపంలో బీమా పాలసీల జారీ: అన్ని బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలకా్ట్రనిక్‌ రూపంలోనే జారీ చేయాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించింది. బీమా పాలసీ డిజిటల్‌ పాలసీల జారీ ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ (ఐఆర్‌) వ్యవస్థ ద్వారా జరుగుతుందని ఇండస్ట్రీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఇండస్ట్రీ సంబంధిత వర్గాలందరూ ఇందుకు అంగీకరించారు. త్వరలోనే నియంత్రణ మండలి నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని భావిస్తున్నా’’మని ఆయన అన్నారు.

Read more