Piramal Finance: విజయవాడలో ‘పిరామల్ గృహ ఉత్సవ్’
ABN , First Publish Date - 2022-11-18T21:44:06+05:30 IST
దేశంలోని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పిరామల్ ఫైనాన్స్ (Piramal Finance) విజయవాడలో గృహ ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది
విజయవాడ: దేశంలోని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పిరామల్ ఫైనాన్స్ (Piramal Finance) విజయవాడలో గృహ ఉత్సవ్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, స్వయం ఉపాధి కలిగిన వారికి గృహ రుణాలను అందించనుంది. శని, ఆదివారాల్లో (19-20వ తేదీల్లో) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బాటా షోరూమ్ సర్వీస్ రోడ్డులో సంయుక్త స్టెల్లా కాలేజీ వద్ద వేదిక్ హాల్‌లో ‘గృహ ఉత్సవ్’ను నిర్వహించనున్నారు.
రూ. 499 లాగిన్ ఫీజుతో 25 బీపీఎస్ తగ్గించి గృహ రుణాలు అందించనుంది. అర్హత కలిగిన వ్యక్తులు, అవసరమైన పత్రాలతో రావడం ద్వారా వెంటనే ఇంటి రుణాలు పొందొచ్చు. దీంతోపాటు అదనంగా 40 ప్రాజెక్టులలో ప్రత్యేక ఆఫర్లను కూడా పొందొచ్చు. శివసాయి వాసవి ఆర్కేడ్, సాయి మ్యాగ్జిమా హైట్స్, హస్నీ ఇన్‌ఫ్రా మిడ్‌ల్యాండ్, శ్రీ టౌన్‌షిప్, దివీస్ ప్యాలెస్, ఎస్‌ఎస్‌బీ డెవలపర్స్ వంటి 18 మంది డెవలపర్లు ఈ ఆఫర్లను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంపై పిరామల్ కేపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ (PCHFL) ఎండీ జైరామ్ శ్రీధరన్ మాట్లాడుతూ.. విజయవాడలో గృహ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఉత్సవ్ ద్వారా అత్యంత సులభంగా గృహ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్ ఒకటని అన్నారు. అప్పటికప్పుడు అనుమతులతో గృహ రుణాలను అందించేందుకు గృహ ఉత్సవ్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని అన్నారు. తమకు గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, అదోనీ, కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, చిత్తూరు, ఏలూరు, చీరాల, భీమవరం, గాజువాక, నర్సారావుపేట వంటి ప్రాంతాల్లో 21 శాఖలు ఉన్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ శాఖలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.