మొన్న తగ్గించారు... మళ్ళీ పెంపు దిశగా పరిణామాలు..! మొన్నటి ‘తగ్గింపు’... ఈ రోజు నుంచే అమల్లోకి

ABN , First Publish Date - 2022-05-30T21:00:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెట్రో ధరలను తగ్గించినప్పటికీ... తాజా పరిణామాల నేపథన్యంలో... ధరలు మళ్ళీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మొన్న తగ్గించారు...  మళ్ళీ పెంపు దిశగా పరిణామాలు..!  మొన్నటి ‘తగ్గింపు’... ఈ రోజు నుంచే అమల్లోకి

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మొన్నమొన్నే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెట్రో ధరలను తగ్గించినప్పటికీ... తాజా పరిణామాల నేపథన్యంలో... ధరలు మళ్ళీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను తరచుగా స్తంభింపజేస్తుండడంతో ప్రైవేట్ ఇంధన రిటైలింగ్ రంగం నిలకడలేమిని ప్రభుత్వానికి నివేదించింది. OMCలు నిరుడు  నవంబరులో నాలుగు నెలలకు పైగా ఇంధన ధరలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. . ఇంధన ధరలలో స్తంభన కారణంగా ఈ(2022) ఏడాది ఫిబ్రవరి నుండి ఇంధన రిటైలర్లు నష్టాలను చవిచూశారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెల(మే) 16 నాటికి పరిశ్రమలో నికర అండర్ రికవరీలు లీటరు  పెట్రోల్‌కు రూ. 13.08, డీజిల్‌పై రూ. 24.09 గా ఉన్నాయి. 


కేంద్ర ప్రభుత్వం పది రోజుల క్రితం(మే 21 న) లీటరు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఇతర లెవీలపై ఈ చర్య ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత... పెట్రోల్ ధరలపై లీటర్‌కు రూ.  9.5, డీజిల్‌పై రూ. 7 తగ్గింపుగా అంచనాలు తెరమీదకొచ్చాయి. ఆ తర్వాత... కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాలు  కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి, తద్వారా ఆ రాష్ట్రాల్లో రేట్లు మరింత తగ్గిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.72 కు తగ్గింది. కాగా... లీటర్ డీజిల్ ధర ఇప్పుడు రూ. 89.62 గా ఉంది. ముంబైలో... తాజా ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత పెట్రోల్ లీటరుకు రూ. 111.35 వద్ద రిటైల్ కాగా, డీజిల్‌ను లీటరు రూ. 97.28 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే... పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8, డీజిల్‌పై లీటర్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఈరోజు(సోమవారం)నుంచే అమల్లోకి వచ్చింది. కాగా... నిరుడు నవంబరులో కూడా, లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గింపు పూర్తిగా ఆర్‌ఐసీలో జరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ట్విట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-30T21:00:51+05:30 IST