Reserve Bank of India: నగదు చెల్లింపుల మోసాలకు చెక్..
ABN , First Publish Date - 2022-12-27T05:11:09+05:30 IST
నగదు చెల్లింపుల మోసాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది...
ముంబై: నగదు చెల్లింపుల మోసాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) మరిన్ని చర్యలు చేపట్టింది. జనవరి 1 నుంచి ఇలాంటి మోసాలను బ్యాంకు లు, పేమెంట్ సిస్టమ్ (Payment System) ఆపరేటర్లు (పీఎ్‌సపీ) కొత్తగా తీసుకొచ్చిన ‘దక్ష్’ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేయాలని కోరింది. చెల్లింపు సంస్థలతో పాటు బాధిత ఖాతాదారులు కూడా ఈ మోసాలను దక్ష్ ప్లాట్‌ఫామ్ (Daksh Platform) ద్వారా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రస్తుతం ఇందు కోసం ఉన్న ఎలకా్ట్రనిక్ డేటా సబ్మిషన్ పోర్టల్ (ఈడీఎస్పీ) స్థానం లో మరిన్ని అధునాతన ఫీచర్లతో ఆర్‌బీఐ ఈ కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. చెల్లింపు మోసాలతో పాటు మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు దక్ష్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.