పౌలీ్ట్రల నిర్వహణకు పౌలీ్ట్రమన్‌

ABN , First Publish Date - 2022-11-25T03:52:54+05:30 IST

పౌలీ్ట్ర ఫారాలను ‘స్మార్ట్‌’గా నిర్వహించడానికి ‘పౌలీ్ట్రమన్‌’ పేరు తో ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ఆధారిత...

పౌలీ్ట్రల నిర్వహణకు పౌలీ్ట్రమన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పౌలీ్ట్ర ఫారాలను ‘స్మార్ట్‌’గా నిర్వహించడానికి ‘పౌలీ్ట్రమన్‌’ పేరు తో ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ఆధారిత యాప్‌ను మహాలక్ష్మి ఐటీ సొల్యూషన్స్‌ (ఎంఐఎల్‌టీ) అందుబాటులోకి తీసుకువచ్చింది. హేచరీలు, ఫారమ్‌లను ఎక్కడి నుంచై నా రియల్‌ టైమ్‌లో మానిటరింగ్‌, నియంత్రణ చేయడానికి పౌలీ్ట్రమన్‌ దోహదం చేస్తుంది. ఐఓటీ, అనలిటిక్స్‌, కృత్రిమ మేధ, బిగ్‌ డేటా వంటి అడ్వాన్స్‌డ్‌, పేటెంటెడ్‌ టెక్నాలజీల ద్వారా పౌలీ్ట్రలలో ఉండే ఉష్ణోగ్రత, గాలి, తేమ, కార్బన్‌ డయాక్సైడ్‌, యంత్రాలు మొదలైన వాటిని దూరంగా ఉండి మానిటర్‌ చేయడమే కాక నియంత్రణ కూడా చేయొచ్చని, పౌలీ్ట్ర పరిశ్రమకు ఇది సమగ్ర యాప్‌ అని పౌలీ్ట్రమన్‌ ఎండీ శ్రీనివాస్‌ తెలిపారు. డేటా ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దీనివల్ల పౌలీ్ట్రల నిర్వహణ, సామర్థ్యాలు పెరిగి ఉత్పత్తి, నాణ్యత పెరుగుతుందని, యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని తెలిపారు.

40 మంది ఖాతాదారులు: గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, సుగుణా ఫుడ్స్‌, విజయనగర్‌ హెచరీస్‌, జీబీఆర్‌ హేచరీస్‌ వంటి 40 సంస్థలు పౌలీ్ట్రమన్‌కు ఖాతాదారులుగా ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో కనీసం 100 సంస్థలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇందులో రెండు, మూడు విదేశీ హేచరీస్‌ కూడా ఉండే వీలుందని శ్రీనివాస్‌ చెప్పారు. కొత్త, పాత ఇంక్యుబేటర్లలో కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చన్నారు.

పౌలీ్ట్ర రంగంలో ఉత్పాదకత, స్థిరత్వాన్ని పెంచడానికి పౌలీ్ట్రమన్‌ దోహదం చేస్తుందన్నారు. కోళ్ల పెంపకం రంగంలో టెక్నాలజీ వాడకం తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కోళ్ల పరిశ్రమ కేంద్రీకృతమైన చెన్నై, కోల్‌కతా, కోయంబత్తూర్‌ వంటి నగరాలపై దృష్టి పెట్టనున్నామని చెప్పారు.

Updated Date - 2022-11-25T03:52:54+05:30 IST

Read more