పుప్పాలగూడలో అపర్ణ జినోన్
ABN , First Publish Date - 2022-01-22T08:16:13+05:30 IST
ప్రముఖ స్థిరాస్తి అభివృద్ధి సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్‌లో మరో వెంచర్ ప్రారంభించింది. పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ప్రారంభించిన ..

రూ.2,550 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ : ప్రముఖ స్థిరాస్తి అభివృద్ధి సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్‌లో మరో వెంచర్ ప్రారంభించింది. పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ప్రారంభించిన ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కోసం కంపెనీ రూ.2,550 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 37 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా 33 ఫ్లోర్లతో 14 బ్లాకులుగా 3,664 అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. కంపెనీకి ఇది 60వ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. 2027కి పూర్తయ్యే ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో 1,020 నుంచి 2,257 చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంతో సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ నిర్మిస్తారు.
స్పోర్ట్ కాంప్లెక్స్, కమర్షియల్ బ్లాక్, 86,423 ఎస్‌ఎ్‌ఫటీ విస్తీర్ణంలో సువిశాల క్లబ్ హౌస్‌తో పాటు ఇంకా అనేక అత్యాధునిక సౌకర్యాలు ఈ వెంచర్లో ఏర్పాటు చేస్తున్నట్టు అపర్ణ కన్స్ట్రక్షన్స్ తెలిపింది. అపర్ణ జినోన్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం కొత్తగా 1,500 మంది ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది.