Ola lay off: ఓలా అనూహ్య నిర్ణయం.. 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన!.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-09-19T21:40:02+05:30 IST

రైడ్ షేరింగ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా (Ola) కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Ola lay off: ఓలా అనూహ్య నిర్ణయం.. 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన!.. కారణం ఇదే..

బెంగళూరు: రైడ్ షేరింగ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా (Ola) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన వ్యాపారాలపై ఆర్థిక భారాలను తగ్గించుకోవడమే లక్ష్యంగా 200 మంది ఉద్యోగులను తొలగించబోతోంది(Employees lay off). వేర్వేరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల విభాగాలను వీరిని తొలగించనున్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా తొలగింపు వేటుపడనున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఓలా యాప్(Ola app)కు సంబంధించి వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్(Ola electric scooter) విక్రయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఓలా గతేడాది డిసెంబర్‌లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. విక్రయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పునరుద్ధరణపై కంపెనీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా నాన్-సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాలపై ఫోకస్ పెట్టింది. ఇంజనీరింగ్, అధ్యయనం-తయారీ(ఆర్‌అండ్‌డీ)కి సంబంధించిన వెహికిల్, సెల్, బ్యాటరీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, అటానమస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్‌తోపాటు ఇతర  విభాగాలపై దృష్టిసారించినట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 


గతంలోనూ 2000 మందిపై వేటు..

ఓలా కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఇదేతొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు పడింది. ప్రీ-ఓన్డ్(Pre-owned) కారు వ్యాపారం ‘ఓలా కార్స్’(Ola Cars), క్విక్ కామర్స్ వ్యాపారం ఓలా డ్యాష్(Ola Dash) మూసివేత సమయంలో దాదాపు 2 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో 30 మందికిపైగా సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా భవీష్ అగర్వాల్ నాయకత్వ టీమ్‌ కూడా ఉండడం గమనార్హం.

Updated Date - 2022-09-19T21:40:02+05:30 IST