Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ ‘హైపర్ సండే’.. ఎస్ 1, ఎస్ 1 ప్రొపై అద్దిరిపోయే ఆఫర్లు!

ABN , First Publish Date - 2022-12-17T19:15:49+05:30 IST

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఈ ఆదివారం అద్దిరిపోయే ఆఫర్లతో వచ్చేస్తోంది. 18న ఉదయం 9 గంటల నుంచి

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ ‘హైపర్ సండే’.. ఎస్ 1, ఎస్ 1 ప్రొపై అద్దిరిపోయే ఆఫర్లు!
Ola Electric

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఈ ఆదివారం అద్దిరిపోయే ఆఫర్లతో వచ్చేస్తోంది. 18న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్1 (S1), ఎస్1 ప్రొ (S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎస్1 ప్రొపై ఏకంగా రూ. 14 వేల రాయితీ ప్రకటించింది. ఇందులో రూ. 10 వేలు నగదు కాగా, రూ. 4 వేలు క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది. ఇక, ఎస్1 స్కూటర్ పరిచయ ధరను రూ. 99 వేలుగా ప్రకటించింది. దీనికి అదనంగా రూ. 2 వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

వినియోగదారులు నెలకు రూ. 2,499 చొప్పున ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చెల్లించుకోవచ్చు. అలాగే, రూ. 3,999 విలువైన ఉచిత సర్వీసు ఏడాది పాటు లభిస్తుంది. అదే కాలపరిమితితో ఉచితంగా హైపర్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు మరో ఆకట్టుకునే ఆఫర్‌ను కూడా ప్రకటించింది. జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్, జీరో ప్రాసెసింగ్ ఫీ లోన్స్, ఎంపిక చేసిన బ్యాంకుల్లో జీరో ఇంట్రెస్ట్‌తో లోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

దేశంలోని 60 నగరాల్లో ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరులో 4, చెన్నై, పూణెల్లో మూడు చొప్పున, ఢిల్లీ, ముంబైలలో రెండేసి, హైదరాబాద్‌లో ఒకటి ఉంది.

Updated Date - 2022-12-17T19:15:50+05:30 IST