ఓలా ఎలక్ర్టిక్
ABN , First Publish Date - 2022-01-25T08:19:13+05:30 IST
ఓలా ఎలక్ర్టిక్ మరోసారి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది. తాజాగా 20 కోట్ల డాలర్లు (రూ.1,490.5 కోట్లు) సమీకరించినట్టు సోమవారం వెల్లడించింది...
ఓలా ఎలక్ర్టిక్ మరోసారి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది. తాజాగా 20 కోట్ల డాలర్లు (రూ.1,490.5 కోట్లు) సమీకరించినట్టు సోమవారం వెల్లడించింది. టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, ఎడెల్వీజ్, తదితరుల నుంచి ఈ నిధులను సమకూర్చుకున్నట్టు పేర్కొంది. కంపెనీ విలువను 500 కోట్ల డాలర్లుగా లెక్కగట్టినట్టు పేర్కొంది.