నాట్కో ఫార్మా లాభంలో 326% వృద్ధి

ABN , First Publish Date - 2022-08-10T05:45:12+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు నాట్కో ఫార్మా మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.3.5 (175%)

నాట్కో ఫార్మా లాభంలో 326% వృద్ధి

వాటాదారులకు 175% డివిడెండ్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు నాట్కో ఫార్మా మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.3.5 (175%) డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. డివిడెండ్‌ చెల్లింపునకు ఆగస్టు 22ను రికార్డు తేదీగా తీసుకుంటారు. కాగా ఏకీకృత ప్రాతిపదికన జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.320.4 కోట్ల నికర లాభాన్ని నాట్కో ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.75 కోట్లతో పోలిస్తే 326 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం కూడా 115 శాతం వృద్ధితో రూ.427.3 కోట్ల నుంచి రూ.919 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. అమెరికాకు లినాలి డోమైడ్‌ ఎగుమతులు ఆదాయం, లాభదాయకత పెరగడానికి దోహదం చేసినట్లు తెలిపింది. 

Updated Date - 2022-08-10T05:45:12+05:30 IST