బిల్ గేట్స్‌తో చర్చలకు మస్క్ ‘నో’...

ABN , First Publish Date - 2022-04-25T00:33:18+05:30 IST

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో దాతృత్వ చర్చలను టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తిరస్కరించాడు.

బిల్ గేట్స్‌తో చర్చలకు మస్క్ ‘నో’...

వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో దాతృత్వ చర్చలను టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్  మస్క్  తిరస్కరించాడు. ఇందుకు సంబంధించి... ఎలాన్ మస్క్, బిల్‌గేట్స్ మధ్య జరిగిన చాట్ సోషల్ మీడియాలో బయటపడింది. గేట్స్ మస్క్‌తో దాతృత్వ  అవకాశాల విషయమై చర్చించాలనుకుంటున్నట్లు చెప్పగా, ఆయన  అభ్యర్థనను మస్క్ తిరస్కరించాడు. ఇదిలా ఉండగా... ఇందుకు సంబంధించిన చాట్‌లను తాను లీక్ చేయలేదని, టెస్లాకు వ్యతిరేకంగా గేట్స్ హాఫ్-బిలియన్ షార్ట్ పొజిషన్‌ను కలిగి ఉన్నారనేది అత్యంత రహస్యమేమీ కాదని మస్క్  ట్వీట్ చేశాడు.

Read more