మస్క్‌ మళ్లీ..

ABN , First Publish Date - 2022-12-16T00:36:28+05:30 IST

ప్రపంచం నం.1 ధనవంతుడి హోదాను కోల్పోయిన ఎలాన్‌ మస్క్‌.. తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లాలో మళ్లీ భారీగా షేర్లను విక్రయించాడు...

మస్క్‌ మళ్లీ..

భారీగా టెస్లా షేర్ల విక్రయం

డెట్రాయిట్‌: ప్రపంచం నం.1 ధనవంతుడి హోదాను కోల్పోయిన ఎలాన్‌ మస్క్‌.. తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లాలో మళ్లీ భారీగా షేర్లను విక్రయించాడు. ఈసారి 358 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,540 కోట్లు) విలువైన షేర్లను అమ్మేశాడు. అయితే, ఆ నిధులను ఎందుకోసం వెచ్చించడాన్న విషయంపైన మాత్రం స్పష్టత లేదు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్‌.. అందు కు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 2,300 కోట్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించాడు. ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్‌ ఈ ఏప్రిల్‌లో ప్రకటించినప్పటి నుంచి టెస్లా షేర ధర సగానికి పైగా తగ్గింది. దాంతో మస్క్‌ వ్యక్తిగత సంపద కూడా భారీగా పతనమైంది. ఈవారంలోనే ఆయన ప్రపంచ కుబేర కిరీటాన్ని చేజార్చుకున్నారు.

Updated Date - 2022-12-16T00:36:32+05:30 IST