అత్యద్భుతమైన ఫీచర్లు.. అందుబాటు ధర: వచ్చేసిన Moto G42

ABN , First Publish Date - 2022-07-08T00:38:02+05:30 IST

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను ఆవిష్కరిస్తూ వినియోగదారుల మనసులు దోచుకుంటున్న మోటొరోలా

అత్యద్భుతమైన ఫీచర్లు.. అందుబాటు ధర: వచ్చేసిన Moto G42

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను ఆవిష్కరిస్తూ వినియోగదారుల మనసులు దోచుకుంటున్న మోటొరోలా (Motorola) మరో అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జి సిరీస్‌లో మరో నయా ఫోన్ ‘జి42’ను విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ‘మోటో జి42’ (Moto G42) బాడీ కోసం పీఎంఎంఏ మెటీరియల్‌ను ఉపయోగించచారు. అల్ట్రా-ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌ కోసం యాక్రిలిక్ గ్లాస్ ఉపయోగించారు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ బరువు 174.5 గ్రాములతో చాలా తేలికగా ఉంది.  రెండు అద్భుతమైన కలర్ వేరియంట్లలో(మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్‌) విడుదల చేశారు.


మోటో జి42 స్పెసిఫికేషన్లు: 6.4 అంగుళాల అమోలెడ్ పంచ్‌హోల్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమరీ, 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఫాస్ట్ చార్జర్, డ్యూయల్ సిమ్‌కార్డ్స్, మైక్రో ఎస్డీకార్డు, ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఫోన్ పనిచేస్తుంది. దీనికి మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ కూడా ఉంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. 


జులై 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్+64జీబీ మెమరీ వేరియంట్ ధర. రూ. 13,999. ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1000 తక్షణ డిస్కౌంట్‌, లేదంటే క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. రిలయన్స్ జియో వినియోగదారులైతే రూ. 2,549 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. 

Read more