రెండేళ్లలో రూ.200 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2022-11-29T03:05:34+05:30 IST

ధ్రువ స్పేస్‌ వచ్చే ఒకటి రెండేళ్లలో 2-2.5 కోట్ల డాలర్ల (రూ.200 కోట్లు) నిధులు సమీకరించాలని భావిస్తోంది. శాటిలైట్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ సదుపాయాన్ని...

రెండేళ్లలో రూ.200 కోట్ల సమీకరణ

ధ్రువ స్పేస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ధ్రువ స్పేస్‌ వచ్చే ఒకటి రెండేళ్లలో 2-2.5 కోట్ల డాలర్ల (రూ.200 కోట్లు) నిధులు సమీకరించాలని భావిస్తోంది. శాటిలైట్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఈ నిధులను వినియోగించనుంది. ఇస్రో పీఎ్‌సఎల్‌వీ సీ 54 మిషన్‌లో భాగంగా రెండు చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్‌ పంపింది. తక్కువ బరువు ఉండే చిన్న ఉపగ్రహాలు థైబోల్ట్‌-1, థైబోల్ట్‌-2లను స్పేస్‌లోకి పంపాం. భవిష్యత్తులో దాదాపు 30 కేజీల వరకూ బరువు ఉండే శాటిలైట్లను తయారు చేసే ప్రక్రియలో ఉన్నామని ధ్రువ స్పేస్‌ సహ వ్యవస్థాపకుడు అభయ్‌ ఇగూర్‌ తెలిపారు. శాటిలైట్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ సదుపాయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఈ దిశగా చర్చలు కూడా జరుపుతున్నాం. ఈ సదుపాయంలో 100 కేజీల వరకూ బరువు ఉండే శాటిలైట్లను అసెంబ్లింగ్‌ చేసి పరీక్షించవచ్చని అన్నారు. 2012లో ధ్రువ స్పేస్‌ను ఏర్పాటు చేశారు. కంపెనీ శాటిలైట్ల, ఎర్త్‌ స్టేషన్లు, శాటిలైట్ల లాంచింగ్‌ సేవలను దేశ, విదేశాల్లోని కంపెనీలకు అందిస్తోంది.

వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపనున్న 30 కేజీల వరకూ బరువు ఉండే శాటిలైట్లు కమ్యూనికేషన్స్‌, ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగపడతాయన్నారు. థైబోల్ట్‌-1, థైబోల్ట్‌-2లను పూర్తిగా హైదరాబాద్‌లో అభివృద్ధి చేశామని ధ్రువ స్పేస్‌ సీఈఓ సంజయ్‌ నెక్కంటి తెలిపారు. దాదాపు 20 చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎ్‌సఎంఈ) ఇందుకు సహకరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాల్లోకి కంపెనీ అడుగు పెట్టనున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-11-29T03:05:42+05:30 IST