మిర్చి డెవలపర్స్‌ ‘వెనిస్‌ సిటీ’

ABN , First Publish Date - 2022-03-05T09:09:56+05:30 IST

ప్రముఖ రియల్టీ సంస్థ మిర్చి డెవలర్స్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టింది.

మిర్చి డెవలపర్స్‌ ‘వెనిస్‌ సిటీ’

పాటి కొల్లూరు వద్ద లగ్జరీ విల్లా ప్రాజెక్టు

ప్రముఖ రియల్టీ సంస్థ మిర్చి డెవలర్స్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టింది. గత ఆరేళ్లుగా రియల్టీ రంగంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికే గండిమైసమ్మ, బాచుపల్లి, మల్లంపేట్‌, దుండిగల్‌ ప్రాంతాల్లో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఇప్పుడు కొత్తగా పటాన్‌చెరు సమీపంలోని పాటి కొల్లూరు వద్ద ‘వెనిస్‌ సిటీ’ పేరుతో 18 ఎకరాల్లో లగ్జరీ విల్లాల ప్రాజెక్టు చేపట్టింది. ఇటలీలోని వెనిస్‌ నగరాన్ని ఆదర్శంగా తీసుకుని మిర్చి డెవలపర్స్‌ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను ఆనుకుని ఉన్న ఈ ప్రాజెక్టు కింద మొత్తం 247 లగ్జరీ విల్లాలు నిర్మిస్తోంది. 


ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 60 శాతానికి పైగా విల్లాలు అమ్ముడైనట్టు కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇతర కంపెనీల్లా గ్రాఫిక్స్‌లో విల్లాలు చూపి, మార్కెట్‌ చేయకుండా నేరుగా ఒక మోడల్‌ విల్లాను నిర్మించి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మోడల్‌ విల్లాలోని కిడ్స్‌ బెడ్‌రూమ్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌, గెస్ట్‌ రూమ్‌ చూసిన ఎవరైనా.. కొంటే ఇలాంటి లగ్జరీ విల్లాలనే కొనాలి అనే రీతిలో తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా, అత్యాధునిక సౌకర్యాలతో మిర్చి డెవలపర్స్‌ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. పరిమిత స్థలంలోనే ఎక్కువ స్పేస్‌ వచ్చేలా ఈ విల్లాలను డిజైన్‌ చేసినట్టు శ్రీనివాస రెడ్డి చెప్పారు. 


 త్వరలో మూడు కొత్త వెంచర్లు 

వెనిస్‌ సిటీకి తోడు మిర్చి డెవలపర్స్‌ కొత్తగా మరో మూడు రియల్టీ ప్రాజెక్టులు చేపడుతోంది. పాటి కొల్లూరు సమీపంలోని నందిగామ్‌ వద్ద 25 ఎకరాల్లో ఒక విల్లాల ప్రాజెక్టు, అదే ప్రాంతంలోని శంకర్‌పల్లి రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో విల్లాల ప్రాజెక్టు కింద 25 ఎకరాల్లో మొత్తం 400 విల్లాలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు  రెండు న్నరేళ్లలో పూర్తి కానుంది. నందిగామ్‌ గ్రామంలోని శంకర్‌పల్లి రోడ్డులో ఎనిమిది ఎకరాల్లో 25 ఫ్లోర్లతో మొత్తం వెయ్యి ఫ్లాట్లు వచ్చేలా మరో ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని  సంస్థ సీఎండీ శ్రీనివాస రెడ్డి చెప్పారు. వీటికి తోడు వెనీస్‌ సిటీ లగ్జరీ విల్లాల ప్రాజెక్టు సమీపంలోనే 2.5 ఎకరాల్లో 12 ఫ్లోర్లతో 350 ఫ్లాట్లు వచ్చేలా మరో ప్రాజెక్టు చేపట్టనుంది. 


ప్రత్యేకతలు 

ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో కొల్లూరు ఐటీ హబ్‌

ఈ ఏడాది డిసెంబరు కల్లా విల్లాల నిర్మాణం పూర్తి

ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో పటాన్‌చెరు బస్టాండ్‌

 ప్రాజెక్టు ఎదురుగా 5.5 ఎకరాల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

25 నిమిషాల ప్రయాణ దూరంలో హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ 

40 నిమిషాల ప్రయాణ దూరంలో ఎయిర్‌పోర్టు

సమీపంలోనే గాడియం అంతర్జాతీయ స్కూల్‌  30 నిమిషాల ప్రయాణ దూరంలో ఏఐజీ, కేర్‌, కాంటినెంటల్‌ వంటి ప్రముఖ ఆస్పత్రులు 

15,000 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో క్లబ్‌ హౌస్‌

ఒక్కో విల్లా ప్రారంభ ధర రూ.1.78 కోట్లు.

Read more