జీవిత బీమా విస్తరణకు చర్యలు అవసరం

ABN , First Publish Date - 2022-12-16T00:33:26+05:30 IST

జీవిత బీమా విస్తరణ దేశంలో తక్కువగా ఉందని, మరింత మందిని జీవిత బీమా కవరేజీలోకి తీసుకురావాల్సిన అవసరం...

జీవిత బీమా విస్తరణకు చర్యలు అవసరం

ఎడెల్‌విజ్‌ టోకియో లైఫ్‌ ఎండీ సుబ్రాజిత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీవిత బీమా విస్తరణ దేశంలో తక్కువగా ఉందని, మరింత మందిని జీవిత బీమా కవరేజీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎడెల్‌విజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుబ్రాజిత్‌ ముఖోపాధ్యాయ అన్నారు. ఇతర ఆర్థిక పెట్టుబడి సాధనాలతో పోలిస్తే జీవిత బీమా దీర్ఘకాల పరిష్కారం. జీవిత బీమా కవరేజీని ప్రోత్సహించడానికి బీమా ప్రీమియంపై ఇచ్చే పన్ను మినహాయింపునకు ఆదాయపు పన్ను చట్టం లో ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరంగా ప్రభుత్వం నుంచి కొన్ని నిర్ణయాలను పరిశ్రమ ఆశిస్తోంది. టర్మ్‌ పాలసీలపై జీఎ్‌సటీని 18 శాతం కన్నా తగ్గించాల్సి ఉంది. దీని వల్ల వ్యయం తగ్గుతుందని.. జీవిత బీమా కవరేజీని పెంచుకునే వారు పెరుగుతారని చెప్పారు.

Updated Date - 2022-12-16T00:33:33+05:30 IST