ఎల్‌ఐసీ లాభం రూ.682.89 కోట్లు

ABN , First Publish Date - 2022-08-13T05:42:52+05:30 IST

ప్రభుత్వ రంగంలోని జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ జూన్‌ త్రైమాసికంలో రూ.682.89 కోట్ల లాభం ఆర్జించింది.

ఎల్‌ఐసీ లాభం రూ.682.89 కోట్లు

ముంబై: ప్రభుత్వ రంగంలోని జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ జూన్‌ త్రైమాసికంలో రూ.682.89 కోట్ల లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సాధించిన లాభం రూ.2.94 కోట్లతో పోల్చితే ఇది కొన్ని రెట్లు అధికం. ఏడాది కాలంతో పోల్చితే ఎల్‌ఐసీ ఆదాయం రూ.1,54,153 కోట్ల నుంచి రూ.1,68,881 కోట్లకు పెరిగింది. తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.5,088 కోట్ల నుంచి రూ.7,429 కోట్లకు పెరిగింది. మార్చి త్రైమాసికంతో పోల్చితే మాత్రం ఫలితాలు నిరుత్సాహపూరితంగా ఉన్నాయి. ఈ త్రైమాసికాదాయం రూ.2,11,451 కోట్లు కాగా లాభం రూ.2,371 కోట్లు, తొలి ఏడాది ప్రీమియం రూ.14,614 కోట్లు గా ఉంది. 


రెండింతలు పెరిగిన హీరో మోటో లాభం: ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటో కార్ప్‌ కన్సాలిడేటెడ్‌ లాభం జూన్‌ 30వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం రూ.256.46 కోట్ల నుంచి రూ.585.58 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2022-08-13T05:42:52+05:30 IST