ఎల్‌ఐసీ కొత్త ప్లాన్ ధన్ సంచయ్
ABN , First Publish Date - 2022-06-15T09:02:39+05:30 IST
ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పేరిట ఒక కొత్త నాన్ లింక్డ్, నార్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
ముంబై/హైదరాబాద్: ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పేరిట ఒక కొత్త నాన్ లింక్డ్, నార్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది తక్షణం అందుబాటులో ఉంటుంది. పాలసీదారుడు ప్లాన్ అమలులో ఉండగా మరణించినట్టయితే గ్యారంటీడ్ టెర్మినల్ బెనిఫిట్ నామినీలకు అందించడంతో పాటు ఇతరులకు మెచ్యూరిటీపై గ్యారంటీడ్ ఆదాయ బెనిఫిట్ చెల్లిస్తుంది.
ప్లాన్ గడువు: కనిష్ఠం 5 సంవత్సరాలు, గరిష్ఠం 15 సంవత్సరాలు
నాలుగు ఆప్షన్లు: లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీజింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్‌తో కూడిన సింగిల్ ప్రీమియం ఎన్‌హాన్స్‌డ్ కవర్ (పాలసీదారులు సౌకర్యాన్ని బట్టి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు).
డెత్ బెనిఫిట్: ప్లాన్ అమలులో ఉండగా పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్ సొమ్ము ఏకమొత్తంలో లేదా 5 వార్షిక వాయిదాల్లో చెల్లిస్తారు. పాలసీదారులకు రుణ సదుపాయం, ఆప్షన్ రైడర్లు (అదనపు ప్రీమి యం చెల్లింపుపై) కూడా అందుబాటులో ఉంటాయి.
కనీస హామీ మొత్తం: ఆప్షన్ ఏ,బీ- రూ.3,30,000, ఆప్షన్ సీ - రూ.2,50,000, ఆప్షన్ డీ - రూ.22,00,000. గరిష్ఠ పరిమితి ఏదీ లేదు.