Jobs for Skilled : నైపుణ్యాలు ఉన్నోళ్లకే ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-12-26T07:14:39+05:30 IST

ఈ సంవత్సరం ఉద్యోగులకు పీడ కల. గత ఆరు నెలల్లో ట్విట్టర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి అనేక టెక్‌ దిగ్గజాలు...

Jobs for Skilled : నైపుణ్యాలు ఉన్నోళ్లకే ఉద్యోగాలు

ఆశ నిరాశల మధ్య కొలువుల పల్లకి

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం ఉద్యోగులకు పీడ కల. గత ఆరు నెలల్లో ట్విట్టర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి అనేక టెక్‌ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపాయి. మన దేశంలోనూ అనేక స్టార్టప్‌ కంపెనీలు వేల మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేశాయి. ఐటీ కంపెనీలూ నియామకాల జోరు తగ్గించాయి. చాలా కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్లను పక్కన పడేశాయి. లేదా ఇపుడు కాదు, ఇంకా వెయిట్‌ చేయండని ఇప్పటికీ ఊరిస్తున్నాయి.

2023 మిశ్రమం

ఈ నేపథ్యంలో 2023 సంవత్సరం కొలువుల మార్కెట్‌ ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. గత ఏడాదంత కఠినంగా ఉండక పోయినా, మార్కెట్‌ పెద్ద ఆశాజనకంగా అయితే ఉండదనే అంచనాలు వినిపిస్తున్నాయి. 5జీ విస్తరణ నేపథ్యంలో టెలికం కంపెనీలు మాత్రం కొద్ది స్థాయిలో నియామకాలకు తెరతీసే అవకాశం కనిపిస్తోంది. కొవిడ్‌ నాలుగో విజృంభణ లేకపోతే 2023 మార్చి త్రైమాసికంలో సేవల రంగంలోనూ కొత్త నియామకాలు జోరందుకుంటాయని టీమ్‌లీజ్‌ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది కూడా కంపెనీలు రీస్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడతాయని అంచనా.

కష్టాల్లో ఐటీ సంస్థలు

ఐటీ సంస్థలకు మాత్రం వచ్చే ఏడా ది అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. పెద్ద మార్కెట్లయిన అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళతాయన్న వార్తలు ఈ కంపెనీలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో ప్రాజెక్టులు లేక బెంచిమీద ఉండే ఉద్యోగుల సంఖ్య పెరిగి పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రధాన ఐటీ కంపెనీలు నియామకాలు పక్కన పెట్టాయి. లేదా తాత్కాలికంగా ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే ఉన్న ఉద్యోగులకే కొత్త డొమైన్ల నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాయి.

Updated Date - 2022-12-26T07:20:26+05:30 IST