Jaguar I-TYPE 6: రియర్ బ్రేక్స్ లేకుండానే వచ్చేసిన ఫార్ములా ఈ-కార్

ABN , First Publish Date - 2022-12-06T19:17:19+05:30 IST

జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ తాజాగా 2023 కారు I-Typeని రివీల్ చేసింది. జాగ్వార్ నుంచి వచ్చిన

 Jaguar I-TYPE 6: రియర్ బ్రేక్స్ లేకుండానే వచ్చేసిన ఫార్ములా ఈ-కార్

లండన్: జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ తాజాగా 2023 కారు I-Typeని రివీల్ చేసింది. జాగ్వార్ నుంచి వచ్చిన అత్యాధునిక ఫార్ములా ఈ-కార్‌గా దీనిని చెబుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఏబీబీ ఎఫ్ఐఈ ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం దీనిని దీనిని డిజైన్ చేశారు. వినూత్న ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌స్పోర్ట్ కేటగిరీ నూతన Gen3 యుగంలోకి ప్రవేశిస్తుంది. వచ్చే సీజన్‌లో ఇది ఇతర జెన్3 కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

jaguar1.jpg

గతేడాదితో పోలిస్తే ఇది తేలికగా, వేగంగా, మరింత సమర్థవంతంగా ఉంటుంది. జెన్3 కారు బరువు 850 కేజీలు. జెన్2తో పోలిస్తే దీని బరువు 74 కేజీలు తక్కువ. గరిష్ఠ వేగం గంటలకు 320 కిలోమీటర్లు. గరిష్ఠ రీజనరేషన్ 600KW. ముందువైపు 250KW, వెనకవైపు 350KW ఉన్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో వెనకవైపు ఉండే హైడ్రాలిక్ బ్రేకులను తొలగించారు.

జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ ఇటీవలే FIA త్రీ-స్టార్ ఎన్విరాన్‌మెంటల్ అక్రిడిటేషన్‌ను పొందడం ద్వారా 2023 సీజన్‌లోకి ప్రవేశిస్తుంది. జాగ్వార్ తన విజయవంతమైన పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని బ్రిటిష్ ఆధారిత టీమ్ ఎన్‌విజన్ రేసింగ్‌కు సరఫరా చేసే మొదటి సీజన్ ఇది. అంటే గ్రిడ్‌లో నాలుగు జాగ్వార్ పవర్డ్ ఫార్ములా ఈ-కార్లు ఉంటాయి.

jaguar2.jpg

జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ మెక్సికోలో 14 జనవరి 2023న 12 నగరాల్లోని 17 రేసుల్లో మొదటి రేసులో పాల్గొంటుంది. ఫార్ములా-ఈలో గత సీజన్‌లో జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ అత్యధిక పాయింట్లు సాధించింది. డ్రైవర్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మిచ్ ఎవాన్స్ రన్నరప్‌గా నిలిచాడు. 2023లో మరోమారు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకోవాలని బ్రిటిష్ జట్టు పట్టుదలగా ఉంది.

Updated Date - 2022-12-06T19:17:21+05:30 IST