పడి లేచింది...అయినా నష్టాలే

ABN , First Publish Date - 2022-12-13T04:16:45+05:30 IST

ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో పాటు విదేశీ నిధుల తరలింపు, అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వ్‌ కీలక సమావేశాలకు...

పడి లేచింది...అయినా నష్టాలే

సెన్సెక్స్‌ 51 పాయింట్లు డౌన్‌

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో పాటు విదేశీ నిధుల తరలింపు, అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వ్‌ కీలక సమావేశాలకు ముందు ఇన్వెస్టర్లలో నెలకొన్న అప్రమత్తత కారణంగా సోమవారం మార్కెట్‌ నష్టాల్లోనే ముగిసింది, ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్ల వరకు దిగజారిన సెన్సెక్స్‌ తదుపరి దశలో నష్టాలను పూడ్చుకుని చివరికి 51.10 పాయింట్ల నష్టంతో 62130.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 18497.15 పాయింట్ల వద్ద నిలకడగా ముగిసింది.సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 నష్టాల్లోనే ట్రేడయ్యాయి. మార్కెట్‌ ధోరణులను తట్టుకుని నిలబడగ లిగే రంగాల్లోనే ఇన్వెస్ట్‌ చేయాలని టేడర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-12-13T04:16:45+05:30 IST

Read more