వడ్డీ ‘రేటు’లో మార్పు..! ఆర్‌బీఐ సంకేతాలు

ABN , First Publish Date - 2022-03-19T00:57:06+05:30 IST

వడ్డీ రేట్ల విషయంలో ‘మార్పు’ ఉంటుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి ఈ మేరకు సంకేతాలు వెలువడుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

వడ్డీ ‘రేటు’లో మార్పు..!  ఆర్‌బీఐ సంకేతాలు

ముంబై : వడ్డీ రేట్ల విషయంలో ‘మార్పు’ ఉంటుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి ఈ మేరకు సంకేతాలు వెలువడుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ పునరుద్ధరణ వేపుగా చూస్తోన్న నేపథ్యంలో... వడ్డీ రేట్ల విషయంలో మార్పు ఉండవచ్చన్నట్లుగా... ఆర్‌బీఐ నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు వినవస్తోంది.


గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ ఫస్ట్‌వేవ్ తర్వాత వినియోగదారుల సెంటిమెంట్... ‘ఆల్-ఇండియా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇండెక్స్(ఏఐసీఎంఐఈ) అత్యధిక స్థాయికి పెరిగింది. సరఫరా వేపు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవల రంగాల్లో...  స్థిరమైన పునరుద్ధరణ రికవరీని విస్తృతమవుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.


కాగా... ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరం కావడంతో, చమురు, ఇతర వస్తువుల ధరలు బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి ఎగసిపడుతున్న విషయం తెలిసిందే. కాగా...  గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లు భారత్‌ను  ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ... ‘డిమాండ్ పరిస్థితుల మెరుగుదలతో పాటు వినియోగదారులు, వ్యాపార విషయాల్లో విశ్వాసం పెరుగుతోంది’ అని విశ్వసిస్తోన్న నేపథ్యంలో... ఆర్‌బీఐ వడ్డీ రేటు వైఖరిలో మార్పునకు సంబంధించిన మొదటి సంకేతాలను వెలువడ్డట్లుగా వినవస్తోంది. 

Read more