ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్.. ధరలో 70శాతం చెల్లిస్తే ఫోన్ మీ సొంతం!

ABN , First Publish Date - 2022-02-20T02:31:50+05:30 IST

ఇన్ఫినిక్స్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. ‘ఇన్ఫినిక్స్ జీరో 5జీ’ పేరుతో ఇండియాలో

ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్.. ధరలో 70శాతం చెల్లిస్తే ఫోన్ మీ సొంతం!

న్యూఢిల్లీ: ఇన్ఫినిక్స్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. ‘ఇన్ఫినిక్స్ జీరో 5జీ’ పేరుతో ఇండియాలో లాంచ్ చేసిన ఈ ఫోన్ 13 5జీబీ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 48 ఎంపీ ప్రధాన కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ జీరో 5జీ 8జీబీ వేరియంట్ ధర రూ. 19,999 మాత్రమే. 


ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు 70శాతం చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే రూ. 14,098 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఏడాది తర్వాత మిగతా 30 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఫోన్‌ను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. స్కైలైట్ ఆరెంజ్, వేగాన్ లెదర్ రంగుల్లో అందుబాటులో ఉంది. 


ఇన్ఫినిక్స్ జీరో 5జీ స్పెసిఫికేషన్లు: 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, సరికొత్త ఎల్‌పీడీడీఆర్‌5 ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్, పెద్ద ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుగా అల్ట్రా ఫాస్ట్ (యూఎఫ్ఎస్)3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ హై కెపాసిటీ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, లో కరెంట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 

Read more