కేర్‌ హాస్పిటల్స్‌ చేతికి ఇండోర్‌ ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-07-05T08:15:37+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ మధ్యప్రదేశ్‌లోకి అడుగు పెడుతోంది.

కేర్‌ హాస్పిటల్స్‌ చేతికి ఇండోర్‌ ఆసుపత్రి

డీల్‌ విలువ రూ.350 కోట్లు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ మధ్యప్రదేశ్‌లోకి అడుగు పెడుతోంది. 2001లో ఇండోర్‌లో ఏర్పాటు చేసిన సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్స్‌ను సొంతం చేసుకుంటోంది. రూ.350-400 కోట్లకు ఈ ఆసుపత్రిని కొనుగోలు చేస్తున్నట్లు కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ సీఈఓ జస్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. మధ్య భారతంలో సీహెచ్‌ఎల్‌ హాస్పిటల్స్‌ మొట్టమొదటి కార్పొరేట్‌ ఆసుపత్రి కావడం విశేషం. కార్డియాలజీ, కార్డిక్‌ సర్జరీ, న్యూరో సైన్సెస్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌ మొదలైన విభాగాల్లో సీహెచ్‌ఎల్‌ ఆసుపత్రికి పేరుంది. ప్రస్తుతం కేర్‌ హాస్పిటల్స్‌ 6 రాష్ట్రాల్లో 15 హెల్త్‌కేర్‌ సదుపాయాలను నిర్వహిస్తోంది. 2,400 పడకల సామర్థ్యం ఉంది. 30 క్లినికల్‌ స్పెషాలిటీ్‌సలో వైద్య సేవలను అందిస్తోంది.   

Read more