Indian Airlines: శ్రీలంక సంక్షోభం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు సువర్ణావకాశం.. అందిపుచ్చుకోగలవా..?

ABN , First Publish Date - 2022-06-08T00:26:30+05:30 IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో ప్రస్తుతం ఇంధన కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు విమాన ఇంధనానికి కూడా..

Indian Airlines: శ్రీలంక సంక్షోభం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు సువర్ణావకాశం.. అందిపుచ్చుకోగలవా..?

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో ప్రస్తుతం ఇంధన కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు విమాన ఇంధనానికి కూడా కొరత ఏర్పడింది. కొన్ని వారాల క్రితం శ్రీలంక ప్రభుత్వం శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చిందని, ఆ వచ్చిన డబ్బుతో ఇతర అవసరాలను తీర్చాలని భావిస్తోందని వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పటికిప్పుడు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను అమ్మకపోవచ్చు గానీ ఈ పరిణామం భారత్‌కు ఒక అవకాశంగా మారింది. శ్రీలంకలో ప్రస్తుతం ఇంధన కొరత ఏర్పడటంతో ఆ దేశం నుంచి విదేశాలకు నడిపే విమానాల్లో ఇంధనం నింపుకునేందుకు చెన్నైను ఇంధన కేంద్రంగా ఈ ద్వీప దేశం వినియోగించుకుంటోంది. ఆస్ట్రేలియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు నడిపే విమానాల్లో ఇంధనం కోసం శ్రీలంకకు చెందిన ఎయిర్‌లైన్స్ విమానాలు చెన్నైను Fuel Stopగా వినియోగించుకుంటుండటం గమనార్హం.



శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణికులు ఎక్కువగా ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాలు, మిడిల్ ఈస్ట్, సౌత్-ఈస్ట్ ఏషియా‌లోని దేశాలకు వెళుతుంటారు. ఇతర దేశాల నుంచి ఈ దేశాలకు వెళ్లే విమానాలతో పోల్చుకుంటే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో ఖర్చు తక్కువ అవుతుండటం ఇందుకు ప్రధాన కారణం. అయితే.. కరోనా సమయం నుంచి ఆయా దేశాలకు శ్రీలంక ఎయిర్‌లైన్స్ సర్వీసులు పెద్దగా నడవడం లేదు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ దేశాలకు వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్ సర్వీసులు మరింతగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఆయా దేశాల నుంచి శ్రీలంకకు వచ్చే విమాన సర్వీసులు కూడా తగ్గిపోయాయి. శ్రీలంకలో ఏర్పడిన ఈ పరిస్థితుల కారణంగా మన దేశం నుంచి పైన పేర్కొన్న దేశాలకు వెళ్లేందుకు, ఆ దేశాల నుంచి ఈ ద్వీప దేశానికి వచ్చేందుకు ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా భారత విమానయాన సంస్థలు ఈ సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకోగలవో లేదో చూడాలి.

Updated Date - 2022-06-08T00:26:30+05:30 IST