multiple credit cards: మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా ?.. ఉండి కూడా వాడడం లేదా...

ABN , First Publish Date - 2022-09-27T23:27:28+05:30 IST

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలం తర్వాత అనూహ్య స్థాయిలో వృద్ధి నమోదయ్యింది.

multiple credit cards: మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా ?.. ఉండి కూడా వాడడం లేదా...

దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అనూహ్య స్థాయిలో వృద్ధి నమోదయ్యింది. ఆర్బీఐ (RBI) డేటా ప్రకారం.. జులై 2022 నాటికి దేశంలో మొత్తం 8.03 కోట్ల క్రెడిట్ కార్డులు సర్క్యూలేషన్‌లో ఉన్నాయి. జులై 2021 తర్వాత ఈ సంఖ్య ఏకంగా 26.5 శాతం మేర వృద్ధి చెందింది. అయితే వినియోగదారుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కలిగివున్నవారే ఎక్కువగా ఉన్నారు. మరి ఒక వ్యక్తికి గరిష్ఠంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి?. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అనే సందేహాలు రావడం సహజం. అందుకు సంబంధించిన వివరాలు మీరూ తెలుసుకోండి.


ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలనేదానిపై పరిమితి ఏమీలేదని క్రెడిట్‌కార్డ్ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒక వ్యక్తికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండడం సందర్భాన్ని బట్టి ఉపయోగకరమే. ఒకటి పనిచేయనప్పుడు ఇంకోటి వాడుకునేదానికి వీలుంటుంది. క్రెడిట్ కార్డుల సంఖ్యను బట్టి వ్యక్తికి రుణ పరిమితి కూడా పెరుగుతుంది. కానీ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నిర్వహణ, సకాలంలో చెల్లింపులు ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. పరిమితి ఉంది కదా అని అధిక వ్యయాలకు మొగ్గుచూపితే అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదని క్రెడిట్ స్కోరింగ్ నిపుణుడు పరిజిత్ గార్గ్  సూచించారు. చెల్లింపులు చేయలేకపోతే బకాయిలు పెరిగిపోతాయని వినియోగదారులను హెచ్చరించారు.


ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండి వాడకపోతే?..

కొంతమంది క్రెడిట్ కార్డు యూజర్లకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటాయి. కానీ వాటిని వాడరు. అలాంటి కార్డులను క్లోజ్ చేయడమే మంచిదని క్రెడిట్ కార్డు నిపుణులు రామచంద్ర సూచిస్తున్నారు. అందుకోసం సంబంధిత కస్టమర్ బ్యాంక్‌కి ఆఫీషియల్‌గా ఒక లెటర్ లేదా మెయిల్ పంపించాలి. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలంటూ కోరాలి. బ్యాంక్ అఫిషీయల్ ఈ-మెయిల్ ఐడీని మాత్రమే సంప్రదించాలి. ఫోన్ కమ్యూనికేషన్ లేదా వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులపై ఆధారపడకూడదని రామచంద్ర పేర్కొన్నారు. క్రెడిట్ కార్డుని క్లోజ్ చేస్తున్నామని బ్యాంకు సమాచారం అందించినప్పుడు మాత్రమే మీరు నిర్ధారణ చేసుకోవాలి. కార్డు క్లోజయిన 45 తర్వాత క్రెడిట్ రిపోర్ట్ కోసం అప్లై చేయాలి. మీ క్రెడిట్ ఎంతనేది అందులో తేలిపోతుంది. ఏమైనా సమస్య ఉంటే బ్యాంకుని సంప్రదించవచ్చు. 


క్రెడిట్ కార్డులు వాడకపోతే ఇలా చేయండి..

- క్రెడిట్ వ్యయాల విషయంలో క్రమశిక్షణగా వ్యవహరించాలి. సకాలంలో బిల్లులు చెల్లించాలి.

- రెగ్యులర్‌గా కొత్త క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

- ఉపయోగించని కార్డులను క్లోజ్ చేయడం మంచిది. ఇలా చేస్తే మోసాల బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా వార్షిక ఫీజుల భారం కూడా తగ్గుతుంది.

- ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడుతుంది.

- మీ వ్యయాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా క్రెడిట్ కార్డుని ఎంచుకోవడం ఉత్తమం.


క్రెడిట్ కార్డు ఇలా ఎంచుకుంటే ఉత్తమం..

క్రెడిట్ ఎంచుకునే విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తమ వ్యయాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తగిన కార్డుని ఎంపిక చేసుకోవాలి. ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌పై వ్యయం చేయాలనుకుంటే షాఫింగ్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా ఉత్తమ ఆఫర్లు, వ్యయాలపై రివార్డులు పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన వ్యక్తులు కో-బ్రాండెడ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని రామచంద్ర అనే క్రెడిట్ కార్డు నిపుణుడు సూచించారు. అమెక్స్(AMEX), డైనర్స్ క్లబ్ (Diner Club), మాస్టర్‌‌కార్డ్ (MasterCard), రూపే (Rupay), విసా (VISA) కార్డు ఇష్యూయర్లకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే తొలిసారి క్రెడిట్ కార్డుకు తీసుకునేవారు విసా లేదా మాస్టర్ కార్డుకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని www.creditcardz.in ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Read more