ఐడీఎఫ్‌సీ క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ ఇండెక్స్ ఫండ్
ABN , First Publish Date - 2022-10-17T09:29:09+05:30 IST
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. ఐడీఎఫ్‌సీ క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ ఏప్రిల్ 2026 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది.
న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. ఐడీఎఫ్‌సీ క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ ఏప్రిల్ 2026 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ కు క్రిసిల్ ఐబీఎక్స్ గిల్ట్ ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. నాణ్యమైన డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది. ఈ ఫండ్ కనీస పెట్టు బడి రూ.5,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) రూపంలో రూ.1,000 చొప్పున పెట్టుబడులు పెట్టుకునే వీలుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 19.