హ్యుండై కార్ల ధరలు పెంపు

ABN , First Publish Date - 2022-12-16T00:30:57+05:30 IST

కార్ల ధరలు జనవరి నుంచి పెంచుతున్నట్టు హ్యుండై మోటార్స్‌ ప్రకటించింది...

హ్యుండై కార్ల ధరలు పెంపు

న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి పెంచుతున్నట్టు హ్యుండై మోటార్స్‌ ప్రకటించింది. పెరిగిన ముడిసరకు వ్యయాలు ఇప్పటివరకు కంపెనీయే భరిస్తూ వచ్చిందని, అందులో కొంత భారం అయినా కస్టమర్లకు పంచాలన్న ఉద్దేశంతో జనవరి నుంచి తమ కార్ల ధరలు పెంచాలని నిర్ణయిం చామని ఆ ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు అన్ని కార్లకు వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఎంత మేరకు పెంచేది మాత్రం వెల్లడించలేదు.

Updated Date - 2022-12-16T00:31:00+05:30 IST