ఆర్‌బీఐ శాండ్‌బాక్స్‌కు హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-06-07T09:29:29+05:30 IST

ఆర్‌బీఐ శాండ్‌బాక్స్‌కు హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ ఎంపిక

ఆర్‌బీఐ శాండ్‌బాక్స్‌కు హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ ఎంపిక

ముంబై: చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) వినూత్న ఆర్థిక సేవలు అందించే హైదరాబాద్‌ ఫిన్‌టెక్‌ కంపెనీ ‘జిక్‌జుక్‌ టెక్నాలజీస్‌’ మరో ఘనవిజయం సాధించింది. శాండ్‌బాక్స్‌ స్కీమ్‌ పేరుతో ఆర్‌బీఐ నిర్వహించే ప్రయోగాత్మక సేవల పరీక్షకు ఎంపికైంది. ఈ పథకం కింద మొత్తం 22 కంపెనీల నుంచి దరఖాస్తులు అందగా సిడ్బీ, జిక్‌జుక్‌ టెక్నాలజీ్‌సతో పాటు మరో ఆరు కంపెనీలను ఎంపిక చేశారు. ఈ కంపెనీలు ఆర్‌బీఐ పర్యవేక్షణలో ఖాతాదారులకు ప్రయోగాత్మకంగా తమ వినూత్న ఆర్థిక సేవలను ఎస్‌ఎంఈలు, ఎంఎ్‌సఎంఈలకు అందించి తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి. 

Read more