ఈవీ, ఎస్‌యూవీలపై హోండా కార్స్‌ దృష్టి

ABN , First Publish Date - 2022-04-15T08:37:13+05:30 IST

జపాన్‌ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్‌ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలోకి అడుగు పెడుతోంది.

ఈవీ, ఎస్‌యూవీలపై హోండా కార్స్‌ దృష్టి

2030 నాటికి 30 ఈవీలు  

వచ్చే నెలలో మార్కెట్లోకి హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ


న్యూఢిల్లీ: జపాన్‌ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్‌ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలోకి అడుగు పెడుతోంది. అలాగే విద్యుత్‌ వాహనాల (ఈవీ) రంగంలో దూసుకుపోయే ప్రణాళికలు ఆవిష్కరించింది. వచ్చే నెలలో సిటీ ఈ:హెచ్‌ఈవీ విద్యుత్‌ కారును, వచ్చే ఏడాది ఎస్‌యూవీని విడుదల చేయానుకుంటున్నట్టు ప్రకటించింది. వచ్చే పదేళ్ల కాలంలో ఈవీ విభాగంలో 4,000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు హోండా కార్స్‌ ఇండి యా ప్రెసిడెంట్‌ తకుయా సుమురా చెప్పారు. గురువారం నాడిక్కడ హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ సెడాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చే ఈ కారుతో తాము హైబ్రిడ్‌ విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు చెప్పారు. అలాగే 2030 నాటికి 30 విద్యుత్‌ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సుమురా తెలిపారు. సిటీ ఈ:హెచ్‌ఈవీకి రెండు సెల్ఫ్‌ చార్జింగ్‌ మోటార్లు, 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌ ఉంటాయి. లీటరుకి 26.5 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు గరిష్ఠంగా 126 పీఎస్‌ విద్యుత్‌ను అందిస్తుంది.  

Updated Date - 2022-04-15T08:37:13+05:30 IST