బూస్ట్ ఇచ్చిన Block Deal.. దుమ్మురేపిన HDFC AMC.. 12% పెరిగిన షేర్లు..

ABN , First Publish Date - 2022-08-16T19:53:52+05:30 IST

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (HDFC AMC) షేర్లు నేడు దుమ్మురేపాయి. మంగళవారం ఇంట్రా-డేలో బీఎస్‌ఈ(BSE)లో

బూస్ట్ ఇచ్చిన Block Deal.. దుమ్మురేపిన HDFC AMC.. 12% పెరిగిన షేర్లు..

HDFC AMC : హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (HDFC AMC) షేర్లు నేడు దుమ్మురేపాయి. మంగళవారం ఇంట్రా-డేలో బీఎస్‌ఈ(BSE)లో 12 శాతం పెరిగి రూ.2,185.30కి చేరుకున్నాయి, కంపెనీ మొత్తం ఈక్విటీలో దాదాపు 6 శాతం బ్లాక్ డీల్స్(Block Deals) ద్వారా చేతులు మారింది. నేటి ఉదయం 09:55 గంటలకు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మొత్తం ఈక్విటీలో 5.61 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11.96 మిలియన్ల ఈక్విటీ షేర్లు(Equity shares) చేతులు మారాయి. 


ఉదయం 11:00 గంటలకు ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌(S&P BSE Sensex)లో 0.74 శాతం పెరుగుదలతో పోలిస్తే ఈ స్టాక్ 11.5 శాతం పెరిగి రూ.2,181.40 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ప్రమోటర్లలో ఒకటైన ABRDN ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (గతంలో స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్) జూన్ 30, 2022 నాటికి కంపెనీలో 16.21 శాతం వాటాను కలిగి ఉంది. 


సెప్టెంబర్ 29, 2021న స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్(HDFC AMC) 10.65 మిలియన్ ఈక్విటీ షేర్లను బీఎస్ఈలో ఒక్కో షేరుకు సగటు ధర రూ. 2,873.79 చొప్పున విక్రయించింది. జూన్ 30, 2022 నాటికి స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ(Standard Life Investments Limited)లో 21.23 శాతం వాటాను కలిగి ఉంది. నేటి ర్యాలీతో, గత మూడు నెలల్లో HDFC AMC 25 శాతం ర్యాలీ చేసింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 శాతం పెరిగింది.  


గత ఒక సంవత్సరంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌(Benchmark Index)లో 8 శాతం పెరుగుదల నుంచి 26 శాతం పడిపోయి స్టాక్ మార్కెట్‌(Stock Market)ను బలహీనపరిచింది. గత నెలలో, రూ. 38-ట్రిలియన్ల దేశీయ మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమకు పోస్టర్ బాయ్ అయిన ప్రశాంత్ జైన్(Prashanth Jain) 19 సంవత్సరాల తర్వాత HDFC AMC నుంచి వైదొలిగారు. ఆయన దేశంలోని మూడవ అతిపెద్ద ఫండ్ హౌస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO)గా పనిచేస్తున్నారు. రూ.4 ట్రిలియన్ల కంటే ఎక్కువ ఆస్తులు ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి.

Updated Date - 2022-08-16T19:53:52+05:30 IST