Haier washing machine: దేశంలోనే తొలిసారి.. టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో వాషింగ్ మెషీన్.. విడుదల చేసిన హయర్

ABN , First Publish Date - 2022-10-12T02:19:51+05:30 IST

దేశంలోనే తొలిసారిగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్‌ మెషీన్ మార్కెట్లోకి వచ్చేసింది. హోమ్

Haier washing machine: దేశంలోనే తొలిసారి.. టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో వాషింగ్ మెషీన్.. విడుదల చేసిన హయర్

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్‌ మెషీన్ మార్కెట్లోకి వచ్చేసింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్‌ సంస్థ హయర్ దీనిని విడుదల చేసింది.  ఏఐ ఆధారిత విప్లవాత్మక వాషింగ్‌ మెషీన్‌ సిరీస్‌ హయర్‌ 979 ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ను అత్యాధునిక సూపర్‌ సైలెంట్‌ డైరెక్ట్‌ మోషన్‌ మోటర్‌, 52.5 సెంటీమీటర్ల సూపర్‌ డ్రమ్‌తో విడుదల చేసింది. ఈ సూపర్‌ డ్రమ్‌ 979 సిరీస్‌ డైరెక్ట్‌ మోషన్‌ మోటర్‌ కలిగి ఉండటంతో పాటుగా కేవలం వాయిస్‌ కమాండ్‌తో దీనిని ఉపయోగించవచ్చు.


అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌ కంపెనీగా హయర్‌ తన మార్కెట్‌ వాటాను నూతన శ్రేణి ఐఓటీ ఆధారిత ఉత్పత్తులతో 5శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా  ప్రీమియం ఉత్పత్తుల జాబితాను బలోపేతం చేయడంపై హయర్‌ దృష్టి సారించింది.  పూణెలోని రంజన్‌గావ్‌తో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో సంస్థకు  అత్యాధునిక తయారీ కేంద్రాలు ఉన్నాయి.  


నూతన శ్రేణి వాషింగ్‌ మెషీన్‌ల విడుదలపై  హయర్‌ అప్లయెన్సస్‌ అధ్యక్షుడు సతీష్‌ ఎన్‌ఎస్‌ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యానికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ప్రతి రోజూ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే ఆవిష్కరణలను పంచుకోవడానికి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నట్టు పేర్కొన్నారు. నూతన ఐఓటీ ఆధారిత ఫ్రంట్‌ లోడ్‌ సూపర్‌ డ్రమ్‌ 979 సిరీస్‌ వాషింగ్‌ మెషీన్‌ విప్లవాత్మక ఆవిష్కరణ అన్నారు. ఇది అత్యాధునిక ఏఐపై ఆధారపడటంతో పాటుగా అతి సులభమైన, తెలివైన, వ్యక్తిగతీకరించిన లాండ్రీ పరిష్కారాలను వినియోగదారులకు అందిస్తుందని వివరించారు. ఈ నూతన శ్రేణి మరింతగా వినియోగదారుల జీవనశైలి పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా  ఎక్కువ మంది ఆదరణ పొందుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 


 ఈ నూతన వాషింగ్‌ మెషీన్స్‌‌లో  హయర్‌ అత్యాధునిక  ఇంటిగ్రేటెడ్‌  డైరెక్ట్‌ మోషన్‌ మోటర్‌ ఉంది. ఇది మెషీన్‌  వైబ్రేషన్స్‌ తగ్గించడంతో పాటుగా శబ్దంలేని పనితీరును అందిస్తుంది.  అలాగే వాషింగ్‌ మెషీన్‌ మన్నికను సైతం మెరుగుపరుస్తుంది.  ఐఓటీ ఆధారిత ఫీచర్లు, కృత్రిమ మేథస్సు  వంటివి మహోన్నత లాండ్రీ అనుభవాలను అందిస్తాయి. ఈ వాషింగ్‌ మెషీన్‌లో  పరిశ్రమలో మొట్టమొదటిసారిగా, అంతర్గతంగా నిర్మించిన వాయిస్‌ కంట్రోల్‌ సాంకేతికత ఉంది. ఇది టచ్‌ ప్యానెల్‌తో  వస్తుంది. అందువల్ల వాషింగ్‌ మెషీన్‌కు కమాండ్స్‌ అందించడంతో పాటుగా మీ ఇంటిలో  ఏ మూల నుంచి అయినా వాషింగ్‌ మెషీన్‌ను ఆదేశించవచ్చు. దీనికి కావాల్సిందల్లా వై–ఫై కనెక్షన్‌ మాత్రమే. అంతేకాదు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో ఏఐ –డీబీఎస్‌ (డైనమిక్‌ బ్యాలెన్స్‌ సిస్టమ్‌) ఉంది. ఇది వాషింగ్‌ మెషీన్‌ స్ధిరంగా, నిశ్శబ్దంగా మొత్తం వాష్‌ సైకిల్‌లో పనిచేస్తుందనే భరోసా కల్పిస్తుంది. ఈ అత్యాధునిక వాషింగ్‌ మెషీన్‌లో 52.5 సెంటీమీటర్ల సూపర్‌ డ్రమ్‌ ఉంది. ఈ మెషీన్‌ 30కిపైగా వాష్‌ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. దీనిలో  యాంటీ బ్యాక్టీరియల్‌ టెక్నాలజీ, డ్యూయల్‌  స్ర్పే టెక్నాలజీ, ప్యురి స్టీమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Updated Date - 2022-10-12T02:19:51+05:30 IST