పన్ను రేట్ల పెంపుపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరలేదు... జీఎస్‌టీ కౌన్సిల్

ABN , First Publish Date - 2022-04-25T00:10:25+05:30 IST

వస్తువులపై రేట్ల పెంపు అంశానికి సంబంధించి రాష్ట్రాల నుండి అభిప్రాయాలు కోరలేదని పేర్కొంటూ, సగానికి పైగా వస్తువులను అత్యధిక పన్ను జీఎస్‌టీ 28 శాతానికి మార్చే ప్రతిపాదన కూడా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పన్ను రేట్ల పెంపుపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరలేదు... జీఎస్‌టీ కౌన్సిల్

న్యూఢిల్లీ : వస్తువులపై రేట్ల పెంపు అంశానికి సంబంధించి రాష్ట్రాల నుండి అభిప్రాయాలు కోరలేదని పేర్కొంటూ, సగానికి పైగా వస్తువులను అత్యధిక పన్ను జీఎస్‌టీ 28 శాతానికి మార్చే ప్రతిపాదన కూడా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కౌన్సిల్ గతేడాది కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర మంత్రులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న మంత్రుల బృందం ఇంకా తన నివేదికను జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉందని వారు తెలిపారు. మొత్తం 143 వస్తువులపై రేట్ల పెంపుపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కౌన్సిల్ కోరినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... కౌన్సిల్... అభిప్రాయాలను కోరలేదని వెల్లడించింది. సగానికి పైగా వస్తువులను అత్యధిక పన్ను జీఎస్‌టీ 28 శాతానికి మార్చే ప్రతిపాదన కూడా లేదని వర్గాలు తెలిపాయి. పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను సూచించడానికి కౌన్సిల్ గత సంవత్సరం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. 

Updated Date - 2022-04-25T00:10:25+05:30 IST