జొమాటోకు ఉబర్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-08-04T08:04:58+05:30 IST

దేశీయ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘జొమాటో’లో తనకున్న 7.78 శాతం వాటాను ఉబర్‌ విక్రయించింది...

జొమాటోకు ఉబర్‌ గుడ్‌బై

7.78ు వాటా రూ.3,088 కోట్లకు విక్రయం 

ముంబై: దేశీయ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘జొమాటో’లో తనకున్న 7.78 శాతం వాటాను ఉబర్‌ విక్రయించింది. ఈ వాటాకు సమానమైన 61.2 కోట్ల షేర్లను గంపగుత్తగా విక్రయించడం ద్వారా ఉబర్‌కు 39 కోట్ల డాలర్ల (రూ.3,088 కోట్లు) ఆదాయం సమకూరింది. డజనుకు పైగా సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేశారు. అందు లో ఫిడెలిటీకి చెందిన ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఫండ్‌ 5.44 కోట్ల షేర్లను సగటున రూ.50.26 చొప్పున మొత్తం రూ.274 కోట ్లకు కొనుగోలు చేసింది. కాగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 4.5 కోట్ల షేర్లను సగటున రూ.50.25 చొప్పున మొత్తం రూ.226 కోట్లకు దక్కించుకుంది. బుధవారం బీఎ్‌సఈలో జొమాటో షేరు ఒకదశలో 9.62 శాతం వరకు క్షీణించి రూ.50.25కు పడిపోయింది. మళ్లీ తేరుకుని చివరికి 0.36 శాతం నష్టంతో రూ.55.40 వద్ద ముగిసింది. 


Updated Date - 2022-08-04T08:04:58+05:30 IST