కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది..

ABN , First Publish Date - 2022-09-17T15:13:02+05:30 IST

బంగారం, వెండి ప్రియులకు శుభవార్త. నేడు(సెప్టెంబర్ 17)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగానే..

కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది..

Gold and Silver Price : బంగారం, వెండి ప్రియులకు శుభవార్త. నేడు(సెప్టెంబర్ 17)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.400 నుంచి రూ.440 వరకు తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.45,800గా ఉంది. కాగా.. గడిచిన 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం. 


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.45,800

విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.45,800

చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927

కేరళలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.45,800 

ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,120 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,950

కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 49,960 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 45,800

ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.49,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.45,800


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,600 

విజయవాడలో కిలో వెండి ధర రూ.64,600

చెన్నైలో కిలో వెండి ధర రూ.61,600

కేరళలో కిలో వెండి ధర రూ.61,600

ముంబైలో కిలో వెండి ధర రూ.54,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.56,400

బెంగళూరులో కిలో వెండి ధర రూ.61,600 

Read more