కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్స్‌పై ఫోకస్‌

ABN , First Publish Date - 2022-08-17T06:15:44+05:30 IST

కాంప్లెక్స్‌ ఇంజె క్టబుల్స్‌ పోర్టుఫోలియోను పెంచుకోవడంపై దృష్టి కేంద్రీక రిస్తాం. హార్మోనల్‌ ఉత్పత్తులు, లాంగ్‌ యాక్టింగ్‌ ఇంజెక

కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్స్‌పై ఫోకస్‌

గ్లాండ్‌ ఫార్మా ఎండీ శ్రీనివాస్‌ వెల్లడి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కాంప్లెక్స్‌ ఇంజె క్టబుల్స్‌ పోర్టుఫోలియోను పెంచుకోవడంపై దృష్టి కేంద్రీక రిస్తాం. హార్మోనల్‌ ఉత్పత్తులు, లాంగ్‌ యాక్టింగ్‌ ఇంజెక ్టబుల్స్‌, పెప్టైడ్ల సామర్థ్యాలను పెంచుకోనున్నామని గ్లాండ్‌ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్‌ సాదు తెలిపారు. బయో లాజిక్‌ విభాగంలో కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ తయారీ (సీడీఎంఓ) మౌలిక సదుపాయాలను కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో భాగస్వాములు, కంపెనీలతో చేతులు కలిపే  అవకాశాలను పరిశీలిస్తున్నామని,. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని శ్రీనివాస్‌ అన్నారు. 


అమెరికాలో పోటీ పెరుగుతోంది..: గత ఏడాదిలో అమెరికా మార్కెట్‌లో పోటీ పెరిగింది. కొన్ని రకాల జనరిక్‌ ఔషధాల ధరలు తగ్గాయి. అయితే.. అమెరికా మార్కెట్‌లో భిన్నమైన ఔషధాలను విడుదల చేయడంతోపాటు ఉత్పత్తుల పోర్టుఫోలియోను పెంచుకోవడం ద్వారా పోటీని అధిగమించనున్నామని వివరించారు. కంపెనీకి కీలక మార్కెట్లయిన యూఎస్‌, కెనడా, యూరప్‌, ఆస్ట్రేలియాల్లో గత కొద్ది సంవత్సరాలుగా సంతృప్తికరమైన వృద్ధి నమోదైందని,. దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. దేశీయ మార్కెట్‌లో ఔషధాల విక్రయాలు పరిమాణ పరంగా పెరగడం వల్ల అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్‌ ఆదాయం 60 శాతం పెరిగిందని చెప్పారు. 


ఇంజెక్టబుల్స్‌కు ఆదరణ: రూమటాయిడ్‌ ఆర్థరైటీస్‌, కేన్సర్‌ ఆటో ఇమ్యునో రుగ్మతలకు కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఔషధాలను ఇంజెక్టబుల్స్‌ రూపంలో ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని.. ఇది ఫార్మా స్యూటికల్స్‌ రంగంలో ఇంజెక్టబుల్స్‌ ప్రాధాన్యాన్ని పెంచనుందని వివరించారు. వివిధ ఫార్మా కంపెనీలు కేన్సర్‌ వంటి రుగ్మతల చికిత్సకు ఔషధాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-17T06:15:44+05:30 IST