ఇక గంగవరం పోర్టు అదానీదే

ABN , First Publish Date - 2022-10-11T09:36:30+05:30 IST

గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌లో (జీపీఎల్‌) 100 శాతం వాటా అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజడ్‌) చేతికి వచ్చింది.

ఇక గంగవరం పోర్టు అదానీదే

100% వాటా ఏపీఎ్‌సఈజడ్‌ చేతికి

పచ్చజెండా ఊపిన ఎన్‌సీఎల్‌టీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌లో (జీపీఎల్‌) 100 శాతం వాటా అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజడ్‌) చేతికి వచ్చింది. గంగవరం పోర్టులోని మిగిలిన 58.1 శాతం వాటాను సొంతం చేసుకోవడానికి తాజాగా ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ ఏపీఎ్‌సఈజడ్‌కు ఆమోదం తెలిపింది. ఈ వాటా సొంతం కావడంతో  జీపీఎల్‌ పూర్తిగా ఏపీఎ్‌సఈజడ్‌కు 100 శాతం అనుబంధ సంస్థ అవుతుంది. గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అదానీ గంగవరం పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కాంపొజిట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌కు సెప్టెంబరు 21న ఎన్‌సీఎల్‌టీ, అహ్మదాబాద్‌ బెంచ్‌ ఆమోదం తెలిపింది. తాజాగా ఈ స్కీమ్‌కు హైదరాబాద్‌ బెంచ్‌ కూడా అంగీకారం తెలిపింది. రెండు బెంచ్‌లు ఇచ్చిన ఆర్డర్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ వద్ద దాఖలు చేసిన వెంటనే స్కీమ్‌ అమలులోకి వస్తుంది. గంగవరం పోర్టును దాదాపు రూ.6,200 కోట్లకు ఏపీఎ్‌సఈజడ్‌ చేజిక్కించుకుంది. ఒక్కో షేర్‌ను రూ.120కు 51.7 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. గంగవరం పోర్టుకు చెందిన 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి కొనుగోలు చేయగా.. మరో 10.4 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో సొంతం చేసుకుంది. షేర్‌ స్వాప్‌ ఒప్పందం ద్వారా ప్రమోటర్లయిన డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబం నుంచి 58.1 శాతం వాటాను చేజిక్కించుకుంది. దీని ప్రకారం జీపీఎల్‌ ప్రమోటర్లకు ఏపీఎ్‌సఈజడ్‌లో 4.77 కోట్ల షేర్లు లభిస్తాయి. నాన్‌ మేజర్‌ పోర్టులలో గంగవరం పోర్టు మూడో అతిపెద్ద పోర్టు. పోర్టుకు దాదాపు 1,800 ఎకరాల భూమి ఉంది.


‘జేపీ’ సిమెంట్‌పై  ఆసక్తి 


ప్పుల భారంతో సతమతం అవుతున్న జేపీ గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌ వ్యాపారాన్ని రూ.5,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరువర్గాలు నిరాకరించాయి. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కొనుగోలు ద్వారా అదానీ గ్రూప్‌ సిమెంట్‌ రంగంలోకి ప్రవేశించింది. తద్వారా దేశంలో అలా్ట్రటెక్‌ సిమెంట్స్‌ తర్వాత రెండో అతిపెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించింది. జేపీ గ్రూప్‌ ఇప్పటికే పలు సిమెంట్‌ యూనిట్లను అలా్ట్రటెక్‌కు విక్రయించింది. అప్పుల భారం తగ్గించుకునేందుకు మిగిలిన యూనిట్లతోపాటు కీలకేతర ఆస్తులను కూడా విక్రయించాలని  నిర్ణయించుకుంది. జేపీ గ్రూప్‌తో గనుక డీల్‌ ఖరారైతే, అదానీ సిమెంట్స్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుకుంటుంది. 2030 కల్లా సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.40 కోట్ల టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

Read more